జాతీయ వార్తలు

విద్యార్థినులపై సామూహిక అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 4: తండ్రి తర్వాత తండ్రిలాంటి వ్యక్తి గురువు అని పెద్దలు అంటారు. అలాంటి గురువులే అనె్నం పునె్నం ఎరుగని 12మంది గిరిజన మైనర్ విద్యార్థినులపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన మహారాష్టల్రోని బుల్దానా జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ సంఘటనకు సంబంధించి 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిలో ఏడుగురు ఉపాధ్యాయులు కాగా, మిగతా నలుగురు పాఠశాల సిబ్బంది అని తెలుస్తోంది. కాగా, అత్యాచారానికి గురయిన వారంతా కూడా 12-14 ఏళ్ల మధ్య వారేనని, వీరిలో ముగ్గురు గర్భవతులని మీడియా కథనాలు పేర్కొన్నాయి. దీపావళి సెలవులకోసం ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ మైనర్ బాలికలపై నిందితులు అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. వీరంతా కూడా బుల్దానా జిల్లాలోని హివర్‌ఖేడాలో ఉన్న నినాది ఆశ్రమ పాఠశాలలో చదువుతున్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరపడానికి సీనియర్ ఐపిఎస్ అదికారి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృదం(సిట్)ను ఏర్పాటు చేశారు. నిందితులపై భారత శిక్షాస్మృతిలోని 376 సెక్షన్, పోస్కో చట్టం, జువనైల్ జస్టిస్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు బుల్దానా జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సంజయ్ బవిస్కార్ చెప్పారు. నిందితుల్లో పాఠశాల అధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి కూడా ఉన్నారని ఆయన తెలిపారు. కాగా, నిందితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని పోలీసులు చెప్తున్నారు.
సత్తా చాటనున్న ఎస్‌పి
యుపిలో నేడు మహా బలప్రదర్శనకు సన్నద్ధం
హాజరవుతున్న లాలూ, దేవెగౌడ, అజిత్, శరద్‌యాదవ్
అధికారమే లక్ష్యంగా ఎన్నికల ప్రచార శంఖారావం
లక్నో, నవంబర్ 4: రానున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మహా బలప్రదర్శనకు అధికార సమాజ్‌వాది పార్టీ సమాయత్తమవుతోంది. శనివారం జరగనున్న పార్టీ సిల్వర్‌జూబ్లీ ఉత్సవాలనే ఇందుకు వేదికగా మార్చుకుంటోంది. జెడియు, ఆర్‌జెడి, ఆర్‌ఎల్‌డి వంటి పార్టీలకు చెందిన నేతలు యుపి అధికార పార్టీ నాయకత్వంతో వేదికనెక్కబోతున్నారు. మాజీ ప్రధాని దేవెగౌడ, ఆర్‌జెడి అధినేత లాలూప్రసాద్, ఆర్‌ఎల్‌డి అధినేత అజిత్‌సింగ్, జెడియు నాయకుడు శరద్ యాదవ్, ఐఎన్‌ఎల్‌డి నేత చౌతాలా, జెడియు నాయకుడు కె.సి.త్యాగిలతో పాటు ప్రముఖ న్యాయవాది రామ్‌జెఠ్మలానీ సహా అనేకమంది ఈ చారిత్రక కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈ వేదికనుంచే ఎన్నికల సమరశంఖాన్ని సమాజ్‌వాది పార్టీ పూరించబోతోందని ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రాకుండా నిరోధించడమే ఏకైక లక్ష్యంగా ముందుకు దూసుకుపోతుందని సమాజ్‌వాది పార్టీ నేతలు చెబుతున్నారు. వచ్చే ఏడాది జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అనంతరం తమ పార్టీ మరింత మెజార్టీతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని, జాతీయస్థాయిలో జరిగే ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి రాకుండా చేయడానికి అన్ని లౌకిక పార్టీలను బలోపేతం చేస్తామని సమాజ్‌వాది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శివపాల్‌యాదవ్ తెలిపారు. అధికార పార్టీలో చీలికలు చోటుచేసుకున్నాయన్న కథనాల నేపథ్యంలో వాస్తవాలను వెల్లడించడానికే రేపటి సమావేశాన్ని ఉపయోగించుకుంటామని ములాయం కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని చాటిచెబుతామని ఆయన చెప్పారు. దాదాపు ఐదులక్షల మంది ఈ సిల్వర్‌జూబ్లీ ఉత్సవాలకు హాజరుకాబోతున్నారని, బిజెపితో పాటు ఇతర ప్రత్యర్థి పార్టీలకు బలమైన సందేశానే్న ఈ వేదికనుంచి అందిస్తామని రాష్ట్ర మంత్రి గాయత్రి ప్రసాద్ ప్రజాపతి తెలిపారు.