రాష్ట్రీయం

సుప్రీం తీర్పు తర్వాతే సమాచార కమిషనర్ల ఖాళీలు భర్తీ: డిఓపిటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: కేంద్ర సమాచార కమిషన్ (సిఐసి)లో ఖాళీగా ఉన్న ముగ్గురు కమిషనర్ల నియామకం విషయమై కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత చేపట్టడం జరుగుతుందని ప్రభుత్వం తెలియజేసింది. ఈ పిటిషన్ వచ్చే నెల 4న విచారణకు రానుందని, ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుకోసం ప్రభుత్వం వేచి చూస్తుందని సిబ్బంది, శిక్షణ వ్యవహారాల విభాగం (డిఓపిటి)కి చెందిన ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. సమాచారం కోసం వచ్చే అపీళ్లను విచారించే అధికారం ఉండే సిఐసిలో ఒక చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, పది మంది సమాచార కమిషనర్లుంటారు. ప్రస్తుతం ఏడుగురు కమిషనర్లు- బసంత్ సేథ్, యశోవర్ధన్ ఆజాద్, శరత్ సభర్వాల్, మంజులా పరాశర్, ఎంఏ ఖాన్ యూసఫి, మాడభూషణం శ్రీ్ధర ఆచార్యులు, సుధీర్ భార్గవ- ఉన్నారు. మిగతా మూడు ఖాళీలను భర్తీ చేయడంలో జాప్యంపై ప్రభుత్వం హక్కుల ఉద్యమ నేతలనుంచి విమర్శలను ఎదుర్కొంటోంది. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, కమిషనర్ల ఖాళీలను భర్తీ చేయడానికి డిఓపిటి 2014లో ప్రకటనలు ఇచ్చింది. వచ్చిన దరఖాస్తుల నుంచి ఖాళీలను భర్తీ చేయడానికి బదులు ఈ ఏడాది సెప్టెంబర్‌లో మరోసారి దరఖాస్తులను కోరింది. సమాచార కమిషనర్లందరిలోకి సీనియర్‌ను చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా నియమించే సంప్రదాయానికి బదులుగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ఈ నెల 16న రక్షణ శాఖ మాజీ కార్యదర్శి ఆర్ మాధుర్‌ను చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా గత ఏడాది జారీ చేసిన ప్రకటనలకు స్పందిస్తూ దరఖాస్తు చేసుకున్న 553 దరఖాస్తుల్లోనుంచి సిఐసిని, సమాచార కమిషనర్లను ఎంపిక చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో డిఓపిటి దాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లింది.