జాతీయ వార్తలు

జెఎన్‌యు విద్యార్థి అదృశ్యంపై ఇండియా గేట్ వద్ద ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 6: ఇరవై రెండు రోజులుగా కనిపించకుండా పోయిన జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థి నజీబ్ అహ్మద్ జాడ కనుగొనడంలో అధికారుల వైఫల్యాన్ని నిరసిస్తూ ఆదివారం సాయంత్రం ఇండియా గేట్ వద్ద జరిగిన విద్యార్థుల నిరసన ప్రదర్శనలో పాల్గొన్న నజీబ్ తల్లి పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించడమే కాక ఆమెను బలవంతంగా లాగేశారు. అనంతరం పోలీసులు నజీబ్ తల్లి, సోదరితో పాటుగా పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. గత నెల 14వ తేదీ సాయంత్రం తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ కుమారుడినుంచి ఫోన్ కాల్ రావడంతో ఉత్తరప్రదేశ్‌లోని బుర్ద్వాన్‌నుంచి నజీబ్ తల్లి ఫాతిమా ఢిల్లీ వచ్చింది. అ మర్నాటినుంచి నజీబ్ జాడ తెలియకుండా పోయింది. అప్పటినుంచి ఆమె దేశ రాజధానిలోనే ఉంది. కాగా, ఆదివారం నిరసన ప్రదర్శనకు అనుమతి ఇవ్వలేదని, చాట్ పూజ కారణంగా ఈ ప్రాంతంలో 144 సెక్షన్ అమలులో ఉందని అంటూ, పోలీసులు మధ్యాహ్నంనుంచి ఇండియా గేట్‌కు వెళ్లే అన్ని మార్గాలను మూసివేశారు. విద్యార్థి అదృశ్యంపై యూనివర్సిటీ క్యాంపస్‌లో కొద్దిరోజుల క్రితం విద్యార్థులు ప్రదర్శన జరిపినప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, ఇతర ప్రతిపక్ష నాయకులు వర్శిటీని సందర్శించారు. అప్పుడు కేజ్రివాల్ ఇండియా గేట్ వద్ద నిరసన ప్రదర్శన జరుపుతాం రండంటూ విద్యార్థులకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఈ ప్రదర్శన జరిగింది. ఇదే విషయమై ఆదివారం కేజ్రివాల్ రాష్టప్రతి ప్రణబ్‌ను కలిసి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.