జాతీయ వార్తలు

సాహసోపేతమైన నిర్ణయం (నరేంద్ర మోదీకి రాష్టప్రతి అభినందనలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అభినందించారు. ‘ఇదో సాహసోపేతమైన నిర్ణయం’ అని వ్యాఖ్యానించారు. నోట్ల రద్దు విషయమై మోదీ రాష్టప్రతిని మంగళవారం సాయంత్రం కలిసి వివరించారు. దీనివల్ల లెక్కలోకి రాని ఆదాయం తేలడంతోపాటు నకిలీ నోట్లను నియంత్రించగలుగుతామని రాష్టప్రతి భవన్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
తమ వద్ద ఉన్న వెయ్యి, 500 రూపాయిల నోట్లను మార్పిడి చేసుకోవడంలో ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించాలని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావల్సిన పనే్లదని పేర్కొన్నారు. 500 రూపాయిల కంటే తక్కువ ధరావత్తు ఉన్న నోట్లు యథాతథంగా చెల్లుబాటులో ఉంటాయని రాష్టప్రతి పేర్కొన్నారు. కొన్ని ప్రత్యేక సేవలకు ప్రస్తుత నోట్లు చెల్లుబాటులోనే ఉంటాయని ప్రధాని సైతం రాష్టప్రతికి వివరించినట్టు తెలిసింది.