జాతీయ వార్తలు

పర్యావరణ అనుమతులు రాష్ట్ర సంస్థలు ఎలా ఇస్తాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,నవంబర్ 8: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి నిర్మాణాలకు పర్యావరణ అనుమతులు ఇచ్చే అధికారం రాష్ట్ర స్థాయి పర్యావరణ సంస్థకు లేదని మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ తరఫు న్యాయవాది రిత్విక్ దత్తా వాదించారు. అమరావతిపై మంగళవారం ఎన్‌జిటిలో విచారణ కొనసాగింది. కొత్త రాజధానిలోని పెద్ద, పెద్ద ప్రాజెక్టులు ఏ కేటగిరీ కిందికి వస్తాయని, ఈ కేటగిరీ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేసే అధికారం రాష్ట్ర స్థాయి పర్యావరణ సంస్థకు ఎంతమాత్రం లేదని దత్తా స్పష్టం చేశారు. ఐదు వందల హెక్టార్లకంటే ఎక్కువ ప్రాంతంలో నిర్మాణాలకు జాతీయ స్థాయి పర్యావరణ సంస్థ నుండి అనుమతులు తీసుకోవలసి ఉంటుందని రిత్విక్ దత్తా వాదించారు. కేంద్ర మంత్రి స్థాయి పర్యావరణ అధ్యయన బృందం పర్యవేక్షించిన తరువాతనే పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని ఆయన సూచించారు. హైడ్రోజయోలాజికల్ సర్వే పూర్తి స్థాయిలో జరగకుండా పర్యావరణ అనుమతులు ఇచ్చేందుకు వీలు లేదని దత్తా వాదించారు. పర్యావరణపరంగా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న విజయవాడ పట్టణానికి సమీపంలోనే మరో పెద్ద నగరం నిర్మాణానికి అనుమతులు ఇస్తే తీవ్ర సమస్యలు ఎదురవుతాయని దత్తా హెచ్చరించారు. తదుపరి విచారణ బుధవారానికి వాయిదా పడింది.