జాతీయ వార్తలు

చర్చల వల్ల లాభమేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, డిసెంబర్ 27: భారత్-పాక్ చర్చలు నాయకులను దాటి ముందుకెల్లాలని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అంటూ, పాకిస్తాన్ ఆటగాళ్లను, కళాకారులను భారత్‌లో ప్రదర్శనలు ఇవ్వడానికి అనుమతించనప్పుడు చర్చలు జరిపి ఏం ప్రయోజనం? అని ప్రశ్నించారు. ‘ఇప్పుడు చర్చలు ప్రారంభమైనాయి. అయితే ఆ చర్చలు నాయకుల మధ్యే జరుగుతున్నాయి, పాక్ గాయకుడు గులాం అలీని ముంబయిలో కచేరి చేయడానికి, పాకిస్తానీ క్రికెటర్లను మన దేశంలో ఆడడానికి అనుమతించనప్పుడు ఈ చర్చలతో ప్రయోజనం ఏముంటుంది?’ అని ఆదివారం ఇక్కడ అయిదు రోజుల సిపిఎం మహాసభల ప్రారంభ ర్యాలీలో మాట్లాడుతూ ఏచూరి అన్నారు. ‘మోదీజీకి విదేశీ పర్యటనలపైనే మోజు. కాబూల్‌లో బ్రేక్‌ఫాస్ట్, లాహోర్‌లో లంచ్, ఢిల్లీలో డిన్నర్ చేస్తున్నారు. తనకు 56 అంగుళాల ఛాతీ ఉందని టెర్రరిజాన్ని ఆపకుండా పాక్‌తో చర్చలు జరిపేది లేదని ఎన్నికలకు ముందు ఆయన చెప్పారు’ అని ఆయన అన్నారు. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో ఏదో ఒక రోజు ఒకటైపోతాయంటూ బిజెపి నాయకుడు రామ్ మాధవ్ చేసిన వ్యాఖ్యలను ఏచూరి తప్పుబడుతూ, దేశంలో మతతత్వాన్ని వ్యాప్తి చేయడమే ఈ వ్యాఖ్యల ఉద్దేశమన్నారు.
బిజెపి, తృణమూల్‌ను గద్దె దింపాలి
కేంద్రంలో మతతత్వ బిజెపిని, రాష్ట్రంలో అవినీతి తృణమూల్ కాంగ్రెస్‌ను గద్దె దింపాలని ఈ సందర్భంగా ఏచూరి పిలుపునిచ్చారు. బిజెపి దేశంలో మతతత్వాన్ని వ్యాప్తి చేస్తోందని, తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్రంలో పేదలను నాశనం చేస్తోందని ఆయన అన్నారు. దేశంలో పరిస్థితి ఏమీ బాగా లేదని అంటూ, అందుకే ఈ రెండు పార్టీలను గద్దె దింపాలని తాము పిలుపునిస్తున్నామన్నారు. బెంగాల్‌లో పరిస్థితి మరీ విషమంగా ఉందని, రాష్ట్రాన్ని కాపాడడం కోసమైనా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మనం విజయం సాధించాలని అన్నారు.
బిజెపి, టిఎంసి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎంపీ మహమ్మద్ సలీమ్ అన్నారు. పార్టీ సభ్యులు రోజుకో కొత్త వ్యక్తిని కలుసుకోవాలని పార్టీకి దూరమైన వర్గాలను తిరిగి దగ్గరికి చేర్చుకోవాలని రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మరో పొలిట్ బ్యూరో సభ్యుడు సూర్యకాంత మిశ్రా పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

కోల్‌కతాలో ఆదివారం సిపిఎం నిర్వహించిన ప్లీనం ప్రారంభ ర్యాలీలో మాట్లాడుతున్న సీతారాం ఏచూరి