అంతర్జాతీయం

ఏమిటీ తాత్సారం? ఐరాసలో మండిపడ్డ భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐరాస, నవంబర్ 8: జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే విషయంలో ఐరాస భద్రతా మండలిలో జరుగుతున్న జాప్యంపై భారత్ మండిపడింది. అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో మసూద్‌ను చేర్చడానికి సాంకేతిక కారణాలు చూపుతూ నెలలు తరబడి తాత్సారం చేయడంపై ఐరాసలో భారత రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ తప్పుపట్టారు. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థను నిషేధించిన ఐరాసా మసూద్‌ను ఎందుకు ఉపేక్షిస్తోందని ఆయన నిలదీశారు. మసూద్ కరుడుగట్టిన ఉగ్రవాదని, ఈ విషయం తేల్చడానికి తొమ్మిది నెలలైనా తేల్చలేదని ఆయన విమర్శించారు. ఐరాస ఉగ్రవాదుల జాబితాలో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ పేరును చేర్చడంపై చైనా తనకున్న వీటో అధికారంతో అడ్డుకుంది. సాంకేతిక కారణాలు చూపింది. ఇలాంటి అభ్యంతరాలకు ఆరునెలలతో అంటే సెప్టెంబర్‌తో గడువుతీరిపోయింది. గతంలో మసూద్‌ను రెండు సార్లు ఉగ్రవాదిగా ప్రకటించే సమయంలో చైనా అడ్డుకుంది. ఉగ్రవాదులను ఉపేక్షించడం వల్ల నిత్యం ఏదో ప్రాంతంలో విధ్వంసం సృష్టిస్తున్నారని అక్బరుద్దీన్ ఆందోళన వ్యక్తం చేశారు.

అంతరిక్షం నుంచి ఓటు
మియామి, నవంబర్ 8: అధ్యక్ష ఎన్నికల్లో అమెరికన్ ఆస్ట్రోనాట్ ఒకరు అంతరిక్షం నుంచి ఓటేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పరిశోధనలు చేస్తున్న వాళ్లలో ఒకే ఒక్క అమెరికన్ వ్యోమగామి షేన్ కింబ్రో రోదసి నుంచి తన ఓటు హక్కును వినియోగించుకున్నట్లు మంగళవారం నాసా ప్రకటించింది. అక్టోబర్ 19నుంచి కింబ్రో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పనిచేస్తున్నారు. ఇద్దరు రష్యా వ్యోమగాములతో కలిసి నాలుగు నెలల రీసర్చ్ మిషన్‌పై ఐఎస్‌ఎస్‌లో ఉన్నారు. 1997 నుంచి అమెరికన్ వ్యోమగాములు అంతరిక్షం నుంచి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. టెక్సాస్ చట్టం పరిధిలో వీరికి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఏర్పడింది. అమెరికాలో ఎక్కువ మంది వ్యోమగాములు నాసా కేంద్రానికి దగ్గర కావటంతో హోస్టన్ ప్రాంతంలోనే ఉంటారు. 1997లో రష్యా అంతరిక్ష కేంద్రం మిర్ నుంచి డేవిడ్ వోల్ఫ్ అనే వ్యోమగామి తొలి సారి రోదసి నుంచి ఓటు వేసారు.