జాతీయ వార్తలు

పాక్‌నుంచి ముగ్గురు భారత దౌత్య ఉద్యోగుల ఉపసంహరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 8: గూఢచర్యానికి పాల్పడుతున్నారని పాక్ ఆరోపించడమే కాకుండా వారి పేర్లను సైతం బహిర్గతం చేయడంతో భారత్ ఇస్లామాబాద్‌లోని తన హైమిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్న ముగ్గు రు దౌత్య ధికారులను మంగళవారం వెనక్కి పిలిచింది. వాణిజ్య వ్యవహారాల ఫస్ట్ సెక్రటరీ అనురాగ్ సింగ్ ఈ ముగ్గురిలో ఒకరు. గత వారం పాకిస్తాన్ విదేశాంగ శాఖ కార్యాలయం ప్రతినిధి నఫీస్ జకరియా ఈ ముగ్గురి పేర్లను వెల్లడించారు. దౌత్యవేత్త అసైన్‌మెంట్ల ముసుగులో పలురు భారత దౌత్యకార్యాలయ ఉద్యోగులు పాకిస్తాన్‌లో ఉగ్రవాద, విచ్ఛిన్నకర కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్నారని కూడా ఆ ప్రతినిధి ఆరోపించారు. సింగ్‌తో పాటుగా విజయ్‌కుమార్ వర్మ, మాధవన్ నందకుమార్‌లు మంగళవారం ఉద యం విమానంలో పాకిస్తాన్‌నుంచి స్వదేశానికి బయలుదేరారు. ఈ దౌత్య ఉద్యోగుల పేర్లు, ఫోటోలు పాక్ దినపత్రికల్లో ప్రచురితం కావడంతో పాటు టీవీ చానళ్లలో ప్రసారం కావడంతో వీరి భద్రతకు ముప్పు ఏర్పడిన దృష్ట్యా వీరిని ఉపసంహరించుకోవాలని భారత్ నిర్ణయించుకుంది. న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ లోని ఆరుగురు దౌత్య అధికారులను పాక్ ఉపసంహరించుకున్న కొద్ది రోజుల్లనే భారత్ ఇస్లామాబాద్‌లోని తన దౌత్య సిబ్బంది ముగ్గురిని ఉపసంహరించుకోవడం గమనార్హం. గూఢచర్యం నిర్వహిస్తున్న ఆరోపణలపై మహమూద్ అఖ్తర్ అనే పాక్ హైకమిషన్ అధికారిని ఢిల్లీలో అరెస్టు చేసి ప్రశ్నించినప్పుడు ఆయన ఈ ఆరుగురి పేర్లను వెల్లడించారు. అఖ్తర్‌ను దేశం వదిలిపెట్టి వెళ్లాల్సిందిగా మన దేశం ఆదేశించిన విషయం తెలిసిందే.
దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ కూడా ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ అధికారి ఒకరిని బహిష్కరించింది.