జాతీయ వార్తలు

పాఠ్యాంశాల్లో అవినీతి వ్యతిరేక పాఠాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 8: లంచం తీసుకోవడం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి పిల్లలు తెలుసువడానికి వీలుగా పాఠ్య పుస్తకాల్లో లంచానికి వ్యతిరేకంగా ఉండే పాఠ్యాంశాలను చేర్చాలని కేంద్ర నిఘా కమిషన్ (సివిసి) సివిసి) కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖను కోరింది. కమిషన్ ఈ విషయాన్ని మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లగా, విద్యార్థుల పాఠ్యపుస్తకాల్లో నిజాయితీ, నైతిక విలువలకు సంబంధించిన పాఠ్యాంశాలను చేర్చేందుకు కసరత్తు జరుగుతోంది. అవినీతి, దానివల్ల కలిగే దుష్పరిణామాల అంశంపై తమ పాఠ్యాంశాల ద్వారా విద్యార్థులకు నిరంతర అవగాహన కల్పించాలనేది తమ లక్ష్యమని, అందుకోసమే ఎన్‌సిఇఆర్‌టి పాఠ్య పుస్తకాల్లో నీతి, నిజాయితీలకు సంబంధించి ఇప్పుడున్న పాఠ్య ప్రణాళికలో మార్పులు తీసుకు వచ్చే అంశాన్ని పరిశీలించాల్సిందిగా తాము మానవ వనరుల మంత్రిత్వ శాఖ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లడం జరిగిందని కేంద్ర విజిలెన్స్ కమిషనర్ కెవి చౌదరి మంగళవారం చెప్పారు. భావితరం నేతలయిన విద్యార్థులకు అవినీతి పట్ల అవగాహన కల్పించడం ద్వారా దేశాన్ని అవినీతి రహితంగా చేయగలమన్న గట్టి నమ్మకం తమకు ఉందని ఆయన చెప్పారు. దీనికి సంబంధించి అవసరమైన విధి విధానాలను రూపొందించడానికి సివిసి, హెచ్‌ఆర్‌డి మంత్రిత్వ శాఖ, సిబిఎస్‌ఇ, ఎన్‌ఇఆర్‌టిలకు చెందిన ప్రతినిధులతో కూడిన బృందం ఒకటి కృషి చేస్తోందని ఆయన చెప్పారు. నిజాయితీ, నైతిక విలువలకు సంబంధించి పాఠ్య పుస్తకాల్లో ఇప్పుడున్న పాఠ్యాంశాలను సమీక్షించడం జరిగిందని, అవినీతి వల్ల ఎదురయ్యే దుష్పరిణామాల తీవ్రతకు సంబంధించి వాటిలో తక్కువ సమాచారం ఉన్నట్లు గుర్తించినట్లు ఆయన చెప్పారు. పదో తరగతి వరకు అవినీతి వ్యతిరేక పాఠ్యాంశాలు ఉండాలనేది తమ ఉద్దేశమని ఆయన చచెప్పారు.

హెచ్‌ఆర్‌డి మంత్రిత్వ శాఖ సివిసితో కలిసి ఈ దిశగా కృషి చేస్తోందని, అతి త్వరలోనే దీనికి సంబంధించిన ముసాయిదా సిద్ధమవుతుందని చౌదరి చెప్పారు.