జాతీయ వార్తలు

మాతృభాషను ప్రోత్సహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, నవంబర్ 8: భారతీయులంతా మాతృభాషను ప్రోత్సహించాలని, తమ పిల్లలకు మాతృభాషను అలవాటు చేయాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. తల్లిదండ్రుల్లో ఆంగ్లభాష వ్యామోహం పెరిగిపోవడంతపై మంగళవారం ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.‘మన పిల్లలందరికీ మాతృ భాష నేర్పాలి. హిందీ, తమిళ్, మలయాళీ, అస్సామీ, పంజాబీ, భోజ్‌పురి ఏ ప్రాంతం వారిమైనా మాతృ భాషను పిల్లలకు బోధించాలి. తద్వారా సొంత భాష అభివృద్ధికి పాటుపడదాం’అని స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో మంత్రి ఉద్ఘాటించారు. స్వాతంత్య్ర వచ్చి ఇనే్నళ్లయినా పరభాషా వ్యామోహంలో ప్రజలు కొట్టుకుపోతున్నారని ఆయన అన్నారు. ఈ విధానానికి స్వస్తిచెప్పాలని వెంకయ్య విజ్ఞప్తి చేశారు. మమీ, డాడీల సంస్కృతిని నుంచి పిల్లలను బయటకు తీసుకురావాలని సమాచార ప్రసార, పట్టణాభివృద్ధి మంత్రి అన్నారు. ఇద్దరు పిల్లలు మాట్లాటుకుంటున్నప్పడు ప్రాంతీయ భాషనే వాడేలా తల్లిదండ్రులు చూడాలని, మధ్యలో మమీ, డాడీలు ఎందుకని ఆయన ప్రశ్నించారు.‘మనం ఏ రాష్ట్రానికి చెందినవారిమైనా మాతృభాషలోనే మాట్లాడుదాం. పిల్లలకు ఇదే నేర్పుదాం’అని వెంకయ్య స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయనో సంఘటన ప్రస్తావించారు. ‘చైనా, ఫ్రాన్స్, రష్యా అధ్యక్షులు ఇటీవల భారత్‌లో పర్యటించారు. అయితే వారికి ఇంగ్లిష్ తెలిసినా, ఎక్కడా దాన్ని వాడలేదు. వారి మాతృభాషలోనే మాట్లాడారు’అని మంత్రి స్పష్టం చేశారు.‘నేను ఆంగ్ల భాష వ్యతిరేకిని కాను. ఆంగ్లంతోపాటు హిందీ నేర్చుకుందాం. కాని పిల్లలకు మాతృభాష నేర్పుదాం. సొంత భాష అభివృద్ధికి పాటుపడదాం’అని ఆయన పేర్కొన్నారు. అర్బన్ డెవలప్‌మెంట్ కార్యక్రమం కింద గుజరాత్‌కు 290 కోట్ల రూపాయల సహాయాన్ని మంత్రి అందజేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం సంస్కరణలు, పారదర్శకత, నైపుణ్యతకు ప్రాధాన్యత ఇస్తోందని ఆయన చెప్పారు.
chitram...
అహ్మదాబాద్‌లో మంగళవారం నిర్వహించిన స్వచ్ఛ భారత్ మిషన్
కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు