జాతీయ వార్తలు

పాక్‌ను ఎలా అడ్డుకుందాం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 8: సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం త్రివిధ దళాధిపతులతో సమీక్ష నిర్వహించారు. ఎలాంటి అంశాలనైనా ఎదుర్కోవడానికి సైనిక దళాల సంసిద్ధత గురించీ వివరాలు తెలుసుకున్నారు. పాక్ సైన్యం గత రెండు నెలల నుంచి తెరిపి లేకుండా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న నేపథ్యంలో సైనిక దళాల సంసిద్ధతపై త్రివిధ దళాధిపతులతో మోదీ చర్చించటం గమనార్హం. సైన్యాధ్యక్షుడు జనరల్ దల్బీర్ సుహాగ్, నావికాదళం అధిపతి ఆడ్మిరల్ సునీల్ లాంబా, వైమానికాదళం అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రాహాలతోపాటు జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు అజిత్ దోవల్ ఈ సమీక్షకు హాజరయ్యారు. పాకిస్తాన్ గత రెండు నెలల్లో దాదాపు 110 సార్లు ఎల్‌వోసి, అంతర్జాతీయ సరిహద్దుల వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పాక్ రేంజర్లు సైనిక పోస్టులతోపాటు పౌరుల ప్రాంతాలను టార్గెట్ చేస్తూ బాంబులు కురిపిస్తోంది. పాక్ రేంజర్ల కాల్పుల్లో ఇంతవరకు పదిమంది పౌరులు మరణించారు. పాక్ సైన్యం ఈ ఏడాది ఇంతవరకు 151 పర్యాయాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే, వీటిలో 110 ఉల్లంఘనలు గత రెండు నెలల కాలంలో జరిగినవే. దీనికితోడు పాక్ సైన్యం సరిహద్దుల వద్ద రేంజర్ల స్థానంలో సైనిక దళాలను మోహరించటంతోపాటు భారీ ఆయుధాలను సరిహద్దుల వద్దకు తరలిస్తోంది. భారత సైన్యానికి చెందిన ప్రత్యేక దళాలు ఆక్రమిత కాశ్మీర్‌లోని ఇస్లామిక్ ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్‌లపై మెరుపుదాడి చేసి వచ్చినప్పటి నుంచి పాక్ సైన్యం కాల్పుల విరమణ ఓప్పందాన్ని పెద్దఎత్తున ఉల్లంఘిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందం రోజురోజుకూ తీవ్రం కావటంతోపాటు ఇస్లామిక్ ఉగ్రవాదుల చొరబాట్లు కూడా బాగా పెరిగాయి. ఉగ్రవాదుల చొరబాట్లను జరిపిందుకు పాక్ రేంజర్లు, పాక్ సైన్యం పెద్దఎత్తున కాల్పులు జరుపుతున్నాయి. కొన్ని సందర్భాల్లో మర తుపాలకులతోపాటు 80 ఎంఎం, 110 ఎంఎం శతఘు్నల వంటి భారీ ఆయుధాలనూ వినియోగిస్తోంది. పాక్ రేంజర్లు, సైన్యం కాల్పులకు భారత దళాలు భారీగా సమాధానం ఇవ్వటంతోపాటు ఇంతవరకు పాక్ సైన్యానికి చెందిన దాదాపు 20 పోస్టులను ధ్వంసం చేశాయి. పాక్ సైన్యం, రేంజర్ల కాల్పుల విరమణ ఒప్పందాన్ని దాదాపుగా తుంగలో తొక్కిన నేపథ్యంలో మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి సారించారని చెబుతున్నారు. అవసరమైతే పాక్‌కు గట్టిగా బుద్ధి చెప్పేందుకు ఎలాంటి వ్యూహాన్ని అవలంభించాలనేది కూడా చర్చకు వచ్చిందనే మాట వినిపిస్తోంది. సైన్యం సంసిద్ధత, ఆయుధ నిల్వలు, వాటి అవసరాలు, ఇతర అంశాలపై త్రివిధ దళాధిపతులు ప్రధాని నరేంద్ర మోదీకి వివరించిన అనంతరం పాక్‌కు బుద్ది చెప్పేందుకు ఏంచేయాలనే అంశంపై పలు ప్రతిపాదనలు చేసినట్టు రక్షణ శాఖ అధికారులు చెబుతున్నారు.
chitram...
ఢిల్లీలో మంగళవారం త్రివిధ దళాధిపతులతో సమావేశమైన ప్రధాని నరేంద్రమోదీ. చిత్రంలో జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు అజిత్ దోవల్