జాతీయ వార్తలు

తేడావస్తే.. పన్ను, పెనాల్టీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 9: రానున్న 50రోజుల కాలంలో రెండున్నర లక్షలకు మించి బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే..ఈ మొత్తానికి డిపాజిటర్ ఆదాయానికి పొంతన లేకపోతే పన్ను, 200శాతం జరిమానా విధిస్తామని కేంద్ర ప్రభుత్వం బుధవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత స్పష్టం చేసింది. రెండున్నర లక్షలకు మించి డిపాజిట్లు జరిగే అన్ని ఖాతాల వివరాలను తమకు వస్తాయని, డిపాజిటర్ల రిటర్న్‌లతో వీటిని ఆదాయం పన్ను అధికారులు బేరీజు వేస్తారని రెవిన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా తెలిపారు. డిపాజిటర్ ప్రకటిత ఆదాయానికి, డిపాజిట్ మొత్తానికి పొంతన లేకపోతే దాన్ని పన్ను ఎగవేతగా పరిగణిస్తామని తెలిపారు. ఇలాంటి కేసుల్లో ఆదాయం పన్ను చట్టంలోని 270(ఎ) సెక్షన్ ప్రకారం పన్ను, జరిమానా వసూలు చేస్తామన్నారు.