జాతీయ వార్తలు

ఓ కొత్త భారతం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 9: అవినీతి రహిత భారత దేశాన్ని సృష్టించడం కోసం 500, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేయాలన్న నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌లో తన నిర్ణయాన్ని స్వాగతిస్తూ అభినందనలు తెలియజేసిన ప్రముఖులకు ఇచ్చిన సమాధానంలో తెలియజేశారు. సినీ రంగానికి చెందిన కరణ్ జోహార్, రజనీకాంత్, అజయ్ దేవగన్, కమలహాసన్, అక్కినేని నాగార్జున, రితేశ్ దేశ్‌ముఖ్, సుభాష్ ఘాయ్, సిద్ధార్థ్ మల్హోత్రా, క్రికెటర్లు అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, కైలాష్ సత్యార్థి లాంటి వారు మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని ప్రశంసిస్తూ ట్వీట్లు చేశారు. వీరందరికీ ప్రధాని స్వయంగా పేరుపేరునా సమాధానమిచ్చారు. ‘రాజకీయాలకు అతీతంగా అందరూ పండగ చేసుకోవలసిన నిర్ణయమిది. ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులు’ అని దక్షిణాది మెగాస్టార్ కమలహాసన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. దీనికి ప్రధాని సమాధానమిస్తూ, మెరుగైన భారత దేశం కావాలని కోరుకుంటున్న నిజాయితీపరులైన భారతీయుల ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ‘హ్యాట్సాఫ్ నరేంద్ర మోదీజీ. నూతన భారత దేశం ఆవిర్భవించింది. జైహింద్’ అని రజనీకాంత్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘్ధన్యవాదాలు. మనమంతా కలిసి సంపన్నమైన, అవినీతి రహిత భారత దేశాన్ని నిర్మిద్దాం’ అని ప్రధాని తన సమాధానంలో పేర్కొన్నారు. ‘ఇది నిజంగా మాస్టర్ స్ట్రోక్. నరేంద్ర మోదీ బంతిని స్టేడియం వెలుపలికి కొట్టారు’ అని కరణ్ జోహార్ తన ట్వీట్‌లో అన్నారు. దీనికి ప్రధాని కృతజ్ఞతలు తెలియజేస్తూ భావితరాల కోసం అవినీతిరహిత భారత దేశాన్ని మనం సృష్టించాలని అన్నారు. కాగా, ‘పన్ను చెల్లించే మాలాంటి వారినందరినీ సత్కరించినందుకు ధన్యావాదాలు. ఆర్థికంగా బలపడే దిశగా భారత దేశం అడుగులేస్తోంది’ అని నాగార్జున తన ట్వీట్‌లో ప్రధానిని అభినందించారు. ‘మన ప్రధాని గారు బ్రహ్మాండమైన గుగ్లీని బౌల్