జాతీయ వార్తలు

రాజకీయం చేయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 9: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని రాజకీయం చేయవద్దని కేంద్ర సమాచార, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు ప్రతిపక్షాలకు హితవు చెప్పారు. బుధవారం నాడిక్కడ విలేఖరులతో మాట్లాడుతూ నల్లధనాన్ని అదుపుచేస్తూ, ఉగ్రవాదుల కార్యక్రమాలకు అడ్డుకట్టవేసే పెద్ద నోట్ల రద్దును స్వాగతించాలని విజ్ఞప్తి చేశారు. పెద్దనోట్ల రద్దుతో ద్రవ్యోల్బణం దిగివస్తుందని వెంకయ్య జోస్యం చెప్పారు.
పెద్దనోట్ల రద్దు నిర్ణయం అకస్మాత్తుగా తీసుకున్నది కాదని ఆయన స్పష్టం చేశారు. దేశంలోని నల్లధనాన్ని అదుపు చేయటంతోపాటు అవినీతిని అరికట్టేందుకు మోదీ ప్రధాన మంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి అనేక చర్యలు తీసుకున్నారని మంత్రి అన్నారు. ఈ అన్ని చర్యల పర్యవసానమే పెద్దనోట్ల రద్దు అని వెంకయ్య నాయుడు తెలిపారు. స్విట్జర్‌లాండ్‌తో కూడా ఒప్పందం చేసుకుని బ్యాంకుల్లోని నల్లధనం ఖాతాల సమాచారం తెప్పించారని మంత్రి గుర్తుచేశారు.
పనామా పేపర్లపై సీనియర్ అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి దర్యాప్తు జరిపించారన్నారు. ప్రధాన మంత్రి పేద ప్రజలను సైతం బ్యాంకింగ్ వ్యవస్థలోకి తెచ్చారు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ప్రజలకు నేరుగా చేరేందుకు చర్యలు తీసుకున్నారని వెంకయ్యనాయుడు చెప్పారు.
ప్రజలకు ఆర్థిక భద్రతతోపాటు సామాజిక భద్రత కల్పించటంపై కూడా మోదీ దృష్టి సారించారని ఆయన తెలిపారు. పెద్దనోట్ల రద్దువల్ల ఆస్తుల ధరలు తగ్గుతాయి, ఆయుధాల వ్యాపారస్తులు, స్మగ్లర్లకు పెద్దదెబ్బ తగులుతుందని ఆయన పేర్కొన్నారు. మోదీ నిర్ణయంపై యావత్ దేశ ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తుంటే కొన్ని ప్రతిపక్షాలు మాత్రం నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడితే పన్ను రాబడి పెరిగి ప్రజలు అభివృద్ది చెందుతారని ఆయన చెప్పారు.