జాతీయ వార్తలు

రాష్ట్రానికి అపోలో టైర్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 10: ఆంధ్రప్రదేశ్‌లో 525 కోట్ల పెట్టుబడితో అపోలో టైర్ల కర్మాగారం ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, అపోలో అధ్యక్షుడు ఓంకార్ కన్వర్ సమక్షంలో రాష్ట్ర పరిశ్రమల డైరక్టర్ కార్తికేయ మిశ్రా, అపోలో టైర్స్ డైరక్టర్ సునమ్ సర్కార్ ఒప్పందంపై సంతకాలు చేశారు. అపోలో టైర్స్ రాష్ట్రంలో అత్యాధునిక టైర్ల ఉత్పత్తి పరిశ్రమను ఏర్పాటు చేస్తుంది.
కేంద్ర మంత్రులతో చర్చ
చంద్రబాబు గురువారం ఉదయం కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీని కలిసి అమరావతిని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతో కలిపే రోడ్ల నిర్మాణం గురించి చర్చించారు. విజయవాడలోని బెంజి సర్కిల్‌పై వంతెన, బైపాస్ రోడ్ల నిర్మాణం గురించి మాట్లాడారు. వర్షాలకు దెబ్బ తిన్న రోడ్ల మరమ్మతులకు ఆర్థిక సహాయం చేయాలని చంద్రబాబునాయుడు కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. అనంతరం సాయంత్రం కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను, ఇంధన మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసి చర్చలు జరిపారు. బిజెపి అధ్యక్షుడు అమిత్ షాను కూడా చంద్రబాబు కలుసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్పీకర్ కోడెలతో కలసి రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఫిబ్రవరి పదో తేదీ నుంచి మూడు రోజులపాటు అమరావతిలో జరిగే జాతీయ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు గురించి రాష్టప్రతికి వివరించారు.
నోట్ల రద్దుపై టెలీకాన్ఫరెన్స్
చంద్రబాబు గురువారం ఢిల్లీ నుండి అమరావతిలోని అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా చూసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 500, వెయ్యి నోట్ల రద్దు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని ఆయన విలేఖరులతో చెప్పారు.