జాతీయ వార్తలు

సినిమాకు జిఎస్టీ దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 10:జిఎస్‌టి విధానం వల్ల చలన చిత్ర పరిశ్రమకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ఐటి పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కోరారు. కెటిఆర్ గురువారం సినీ నిర్మాతలు డి సురేష్‌బాబు, సి కల్యాణ్‌లతో కలసి జైట్లీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జిఎస్‌టి కారణంగా సినీ పరిశ్రమకు ఎలాంటి సమస్యలు ఎదురు కాకుండా చూస్తానని ఆర్థిక మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే కెటిఆర్ రాష్ట్రానికి సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న వివిధ ప్రాజెక్టుల వివరాలతో ఒక వినతిపత్రాన్ని ఆయనకు అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హైదరాబాద్ ఫార్మా సిటీ నిర్మాణానికి అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బయ్యారంలో సమీకృత ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలన్నారు. 850 ఎకరాల్లో రెండు దశలుగా ఏర్పాటు చేస్తున్న వైద్య పరికరాల పార్క్‌కు, వరంగల్‌లో ఏర్పాటు చేయతలపెట్టిన టెక్స్‌టైల్ పార్క్‌కు, మెదక్‌లో ఎన్‌ఐఎంజడ్‌కు, వరంగల్-హైదరాబాద్ పారిశ్రామిక కారిడార్‌లోని క్లస్టర్లకు వౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. డ్రై పోర్టు ఏర్పాటుకు అవసరమైన చర్యలను వెంటనే చేపట్టాలని జైట్లీని కోరారు. పసుపుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ స్పైస్ పార్క్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చాలాకాలం నుండి కోరుతోందని, దానికి అనుమతి ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్న రాష్ట్రానికి సంబంధించిన అంశాల గురించి తగు నిర్ణయాలు తీసుకునేందుకు సంబంధిత శాఖలు, అధికారులతో ఒక సమావేశాన్ని వీలున్నంత త్వరగా ఏర్పాటు చేయాలని కెటిఆర్ ఆర్థిక మంత్రిని కోరారు. అనంతరం కెటిఆర్ జౌళి శాఖ మంత్రి స్పృతి ఇరానీ, వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి వినతిపత్రాలు అందజేశారు. రాష్ట్ర సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

చిత్రం,,, కేంద్రమంత్రి జైట్లీతో మంత్రి కెటిఆర్