జాతీయ వార్తలు

నెలకు 2వేల కోట్లు నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 10: పెద్ద నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి నెలకు రూ. 1000-2000 కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందంటూ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రియల్ ఏస్టేట్ రంగం కుదేలు అవుతుందని, దీనిపై వచ్చే ఆదాయం 90 శాతం వరకు తగ్గే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి లెక్కలతో సహా గవర్నర్ నరసింహన్‌కు వివరించారు. కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి గురువారం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో నాలుగు గంటల పాటు సుదీర్ఖంగా చర్చలు జరిపారు. ఆర్థిక సంవత్సరం మధ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రాలకు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందన్నారు.దేశ చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా పన్నుల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటాను కేంద్రం చాలా వరకు తగ్గించిందన్నారు. కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఏడాదికి రూ.13,995 కోట్లు రావాల్సి ఉందని, దీనిని 14 విడతల్లో కేంద్రం చెల్లిస్తుందన్నారు. దీని ప్రకారం కేంద్రం నుంచి నెలకు రూ.997 కోట్లు రావాల్సి ఉండగా ఈ నెలలో కేవలం రూ.585 కోట్లు మాత్రమే వచ్చాయని గవర్నర్‌కు తెలిపారు. ఆర్థిక సంవత్సరం మధ్యలో పన్నుల వాటా తగ్గించడం వల్ల రాష్ట్రాలకు చాలా ఇబ్బంది కలుగుతుందని,అనుకున్న కార్యక్రమాలను అమలు చేయడం కష్టమన్నారు. గతంలో ఏ ప్రభుత్వం ఇలా చేయలేదని కెసిఆర్ ఆందోళన చెందినట్టు తెలిసింది. కేంద్రం నుంచి ఇవ్వాల్సిన వాటాల్లో చేర్పులు, మార్పులు ఏవేనా ఉంటే మార్చి నెలలో బడ్జెట్ రూపొందించేటప్పుడు చేస్తారే తప్ప ఇలా మధ్యలో చేయడం వల్ల రాష్ట్రాలకు తీవ్ర ఇబ్బందికరమన్నారు. రాష్ట్రంలో ప్రతీ రోజు ఆస్తుల లావాదేవీలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు 3 వేల వరకు జరుగుతాయని, నోట్ల రద్దు వల్ల ఈ రెండు రోజులలో కేవలం 150-300 మాత్రమే జరిగాయని ముఖ్యమంత్రి వివరించారు. ఈ రంగంలో రాష్ట్రానికి నెలకు రూ.320 కోట్ల రాబడి రావాల్సి ఉండగా నెలకు రూ. 20 కోట్ల చొప్పున నష్టం వాటిల్లనుందని ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రంలో ప్రతీ రోజు 3 వేల వరకు వాహనాల అమ్మకాలు జరుగుతాయని, అయితే నోట్ల రద్దు ప్రభావం వల్ల ఇది సగం కంటే తక్కువకు (1100) పడిపోయిందన్నారు. ఎక్సైజు, లగ్జరీ టాక్స్ తదితర రంగాల్లో కూడా ఆదాయం బాగా తగ్గే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ఆదాయంలో చిన్న వ్యాపారులదే పెద్ద వాటా అని, నగదుతోనే ఎక్కువ వ్యాపారాలు జరుగుతాయన్నారు. కానీ నగదు చెలామణిపై ఆంక్షల వల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం పడిపోయే అవకాశం ఉందన్నారు. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులపై కేంద్రం నుంచి ఎలాంటి మినహాయింపులు వస్తాయో వేచి చూడాల్సి ఉంటుందని కూడా కెసిఆర్ అన్నట్టుగా తెలిసింది.

చిత్రం... గురువారం గవర్నర్ నరసింహన్‌ను కలిసిన ముఖ్యమంత్రి కెసిఆర్