జాతీయ వార్తలు

రాబడికి ‘రద్దు’ దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 10: నల్లధనాన్ని వెలికి తీయడానికి పెద్ద నోట్లను రద్దు చేసిన కేంద్ర నిర్ణయం రాష్ట్ర ఖజానాపై తీవ్ర ప్రభావం చూపనుందన్నది ఆర్థిక శాఖ అధికారులు అంచనా. పాత నోట్ల రద్దుతో రాష్ట్ర ఆదాయమే కాకుండా కేంద్ర వసూలు చేసే పన్నులలో రాష్ట్రానికి రావాల్సిన వాటా కూడా తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. సెప్టెంబర్ నెలాఖరు నాటికి అర్ధవార్షిక ఆదాయ రాబడిలో 28 శాతం పెరుగుదల కనిపించడంతో ఆర్థిక పరిస్థితి నిరుడి కంటే బాగుంటుందని ప్రభుత్వం తొలుత అంచనా వేసింది.రాబడిలో పురోగతి కనిపించడంతో పంట రుణ మాఫీ మూడవ విడత చెల్లింపుల కోసం రూ.2019 కోట్లను రెండు రోజుల కిందట విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆరోగ్యశ్రీ బకాయిల చెల్లింపుల కోసం దాదాపు వెయ్యి కోట్లు, ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిల కోసం సుమారు రూ.2000 కోట్లు, ఇతర పెండింగ్ బిల్లుల కోసం రూ.1000 కోట్లు విడుదల చేయాల్సింది ఉంది. వీటన్నింటికీ కలిపి మొత్తంగా దాదాపు రూ. 6000 కోట్లు రాష్ట్ర ఖజానా నుంచి ఈ నెలలో విడుదల కావాల్సి ఉంది. నెల రోజులలో బకాయిలన్నింటినీ చెల్లించాల్సిందిగా ఇటీవల జరిగిన మంత్రిమండలి సమావేశంలోనే అధికారులు ముఖ్యమంత్రి ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఉహించని విధంగా కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయడంతో రాష్ట్ర ఖజానాపై దీని ప్రభావం తీవ్రంగానే ఉండే అవకాశం ఉందంటున్నారు.
తాత్కాలికంగా కొంతకాలం ఆర్థిక ప్రతిష్టంభన ఉంటుందని, దీనివల్ల రాష్ట్ర ఖజానాకు నెలసరి రానున్న రూ. 5000 కోట్ల ఆదాయంలో తగ్గుదల తప్పకుండా ఉంటుందని అధికారులు విశే్లషిస్తున్నారు. రాష్ట్ర ఆదాయానికి బంగారు బాతులాంటి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా రావాల్సిన రాబడి... నోట్ల రద్దుతో దాదాపు నిలిచిపోయిందని తెలుస్తోంది. ఒక్క హైదరాబాద్ నగరంలోనే ప్రతీ రోజు 150 వరకు స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు జరగాల్సి ఉండగా ఈ రెండు రోజులలో 27 రిజిస్ట్రేషన్లు మాత్రమే నమోదైనట్టు ప్రభుత్వానికి సమాచారం అందింది. దీనిప్రకారం ఆదాయంపై నోట్ల రద్దు ప్రభావం ఏ మేరకు ఉంటుందో ఊహించవచ్చని అధికార వర్గాలు విశే్లషిస్తున్నాయి. అలాగే కేంద్రం ప్రభుత్వం వసూలు చేసే పన్నుల్లోంచి రాష్ట్రానికి చెల్లించాల్సిన వాటా 1000 కోట్లు కాగా ఈ నెలలో 600 కోట్లు మాత్రమే విడుదల చేయడంతో మిగతా 400 కోట్లు కోల్పోయినట్టేనని అంచనా వేస్తున్నారు. నోట్ల రద్దు ప్రభావం కేంద్ర పన్నులపై కూడా ఉండటంతో రాష్ట్రానికి రావాల్సిన వాటాను నష్టపోక తప్పకపోవచ్చని అధికారులు అంచన వేస్తున్నారు.