జాతీయ వార్తలు

ట్రంప్ విజయంతో పాక్‌కు గుబులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, నవంబర్ 10: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలవడంతోనే ఆయన భారత్‌కు అనుకూలంగా తన విదేశాంగ విధానాన్ని అమలు చేయడం ప్రారంభిస్తారేమోనని పాకిస్తాన్ భయపడుతోందని విశే్లషకులు అంటున్నారు. దక్షిణాసియా ప్రాంతంలో చారిత్రక మిత్రపక్షాలైన పాకిస్తాన్, అమెరికా మధ్య ఇటీవలి కాలంలో సంబంధాలు దెబ్బతినడం తెలిసిందే. ఇస్లామిక్ ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆశ్రయం ఇస్తోందని అమెరికా ఆరోపించడమే దీనికి ప్రధాన కారణం. పాక్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తోంది. గత మేలో అమెరికా ద్రోణ్ ఒకటి పాక్ భూభాగంలోపల అఫ్గాన్ తాలిబన్ నేతను హతమార్చిన తర్వాత ఈ సంబంధాలు మరింతగా దిగజారాయి. అదే సమయంలో జమ్మూ, కాశ్మీర్‌లోని ఉరీ ఆర్మీ క్యాంప్‌పై పాకిస్తానీ ఉగ్రవాదులు దాడి చేసి 19 మంది జవాన్లను హతమార్చిన సంఘటన తర్వాత పాకిస్తాన్‌తో భారత్ సంబంధాలు సైతం దెబ్బతిన్నాయి. చాలామంది పాకిస్తానీల దృష్టిలో ట్రంప్ కరుడుగట్టిన ముస్లిం వ్యతిరేకి అనే భావన ఉంది. ముస్లింలు అమెరికాలో అడుగుపెట్టకుండా నిషేధించాలని ఆయన గతంలో ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా భారత్‌తో వ్యాపార సంబంధాలను కలిగి ఉన్న వ్యక్తి కావడంతో ఆయన ప్రభుత్వం భారత్ వైపు మొగ్గు చూపవచ్చని వారి అంచనా. ‘అమెరికా పాకిస్తాన్‌ను పూర్తిగా వదిలిపెట్టదు కానీ పాకిస్తాన్ విషయంలో హిల్లరీ క్లింటన్‌కన్నా ట్రంప్ కఠినమైన అధ్యక్షుడుగా ఉంటారనేది కచ్చితం’ అని లాహోర్‌కు చెందిన విదేశీ వ్యవహారాల విశే్లషకుడు హసన్ అస్కారీ రిజ్వి అభిప్రాయ పడ్డారు.
అంతేకాదు ట్రంప్ హయాంలో పాకిస్తాన్‌తో పోలిస్తే భారత్ మెరుగైన సంబంధాలను కలిగి ఉంటుందని తాను అభిప్రాయ పడుతున్నట్లు కూడా ఆయన చెప్పారు. భారత్, పాకిస్తాన్‌ల మధ్య మధ్యవర్తిత్వానికి తాను సిద్ధమేనని ఇటీవల చెప్పినప్పటికీ ట్రంప్ ఇప్పటివరకు దక్షిణాసియాకు సంబంధించి తన విధానమేమిటో ఇప్పటివరకు వివరించలేదు.
అంతేకాదు అఫ్గానిస్థాన్‌లో 50 వేల మంది అమెరికా సైనికులను ఉంచాలని, ఎందుకంటే అణ్వస్త్ర దేశమైన పాకిస్తాన్‌కు ఆనుకుని అది ఉందని ఆయన గత మేలో ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ అన్నారు.

యూనివర్సిటీ ఆఫ్ కనెక్టికట్ ఆవరణలో ట్రంప్‌కు వ్యతిరేకంగా సమావేశం నిర్వహించిన ముస్లిం విద్యార్థులు