జాతీయ వార్తలు

ఆర్థిక ఉగ్రవాదాన్ని అరికడుతుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 10: రెండు పెద్ద కరెన్సీ నోట్ల చలామణిని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ, ఈ చర్య దీర్ఘకాలంలో ‘ఆర్థిక ఉగ్రవాదాని’కి వ్యతిరేకంగా పోరాడటంలో, నల్లధనాన్ని ‘విద్రోహ కార్యకలాపాల’కు వినియోగించడాన్ని నియంత్రించడంలో దోహదపడుతుందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి (పశ్చిమ) సుజాతా మెహతా అన్నారు. ఇక్కడ రెండు రోజుల పాటు జరిగే ఒక అంతర్జాతీయ సదస్సులో ఆమె గురువారం కీలకోపన్యాసం చేశారు. సీమాంతర ఉగ్రవాదం అత్యంత విధ్వంసకరంగా పరిణమించిందని, ఉగ్రవాదులు స్వర్గ్ధామాలను, సురక్షిత కేంద్రాలను అనుభవించడాన్ని నిరోధించవలసిన అత్యవసరం ఏర్పడిందని ఆమె అన్నారు. దేశ శాంతికి, స్థిరత్వానికి, పురోగతికి ఈ ఉగ్రవాదం పెను సవాలుగా మారిందని వివరించారు. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ వరల్డ్ అఫేర్స్ (ఐసిడబ్ల్యుఎ) ఈ సదస్సును నిర్వహిస్తోంది. ఈ చర్య దీర్ఘకాలంలో ఆర్థిక ఉగ్రవాదాన్ని అణచివేస్తుందని ఆమె పేర్కొన్నారు.