జాతీయ వార్తలు

ఏకపక్షం.. రాజ్యాంగ విరుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 10: సట్లెజ్- యమునా నదుల సంధాన కాలువ నిర్మాణ విషయంలో పంజాబ్ ప్రభుత్వానికి తీవ్ర విఘాతం కలిగింది. ఈ ఒప్పందాన్ని రద్దుచేసుకుంటూ 2004లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం అంటూ సుప్రీం కోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్, జమ్మూకాశ్మీర్, ఢిల్లీ, చండీగఢ్‌లతో కుదుర్చుకున్న సట్లెజ్-యమున నందుల సంధాన ఒప్పందాన్ని రద్దు చేసుకుంటూ పంజాబ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టింది. ఇన్ని రాష్ట్రాలతో కుదుర్చుకున్న ఒపందాన్ని ఏకపక్షంగా ఎలా రద్దు చేసుకుంటారని పంజాబ్ ప్రభుత్వాన్ని నిలదీసింది. న్యాయమూర్తి ఎ.ఆర్.దవె సారథ్యంలోని ఐదుగురు సభ్యుల సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. 2004లో ఈ ఒప్పందాన్ని పంజాబ్ ఏకపక్షంగా రద్దుచేసుకోవడం అనేది రాజ్యాంగ విరుద్ధమని పూర్తిస్థాయిలో ఏకపక్ష నిర్ణయమని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ఈ అంశాన్ని రాష్టప్రతికి నివేదించాలంటూ వచ్చిన ఐదు ప్రశ్నలకు ప్రతికూలమైన సమాధానాలే ఉన్నాయని సుప్రీం బెంచ్ ఏకగ్రీవంగా స్పష్టం చేసింది. 2003లో సట్లెజ్-యమునా నదుల సంధాన కాల్వ నిర్మాణాన్ని అనుమతిస్తూ తామిచ్చిన తీర్పుకు విరుద్ధంగా 2004లో పంజాబ్ ప్రభుత్వం ఏకపక్షంగా చర్యలు చేపట్టిందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. 2003లో తామిచ్చిన తీర్పునకు పూర్తి విరుద్ధంగానే పంజాబ్ ప్రభుత్వం వ్యవహరించిందని వ్యాఖ్యానించింది. కెప్టెన్ అమరీందర్ సింగ్ సారథ్యంలోని అప్పటి పంజాబ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం 2004 చట్టాన్ని తీసుకువచ్చింది. దానిద్వారా అంతకుముందు ఏడాది సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు చెల్లుబాటునే సవాల్ చేసింది. అలాగే సట్లెజ్-యమునా నదుల సంధాన కాలువ తదుపరి నిర్మాణాన్ని కూడా నిలిపివేసింది.

మా నీళ్లు వదులుకోం
పంజాబ్ సిఎం బాదల్

చండీగఢ్, నవంబర్ 10: పంజాబ్ నదీ జలాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర రాష్ట్రాలకు ఇచ్చే ప్రసక్తే లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ ఉద్ఘాటించారు. సట్లెజ్- యమున నదుల సంధాన ఒప్పందం రద్దును సుప్రీం కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గం గురువారం అత్యవసరంగా సమావేశమై పరిస్థితిని సమీక్షించింది. రాష్ట్ర నదీజలాలు ఇతర రాష్ట్రాలకు వెళ్లకూడదన్న ఉద్దేశంతోనే ఎస్‌వైఎల్ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నామని.. తమ హక్కును పరిరక్షించుకునేందుకు అవసరమైన అన్ని చర్యలూ చేపడతామని బాదల్ స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు తీర్పుపై న్యాయపరంగా అవసరమైన అన్ని చర్యలూ చేపడతామని తెలిపారు.