జాతీయ వార్తలు

వెనక్కి తగ్గేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 10: అవినీతి రహితమైన బలమైన భారత దేశాన్ని నిర్మించడంలో తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదని ప్రధాని నరేంద్ర మోదీ గురువారంనాడు పునరుద్ఘాటించారు. 500, 1000 రూపాయల నోట్ల చెలామణీని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై విమర్శలను తిప్పికొట్టారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల తాత్కాలికంగా పడే కష్టం కంటే రాబోయే రోజుల్లో మంచే జరుగుతుందన్న ఉత్సాహాన్ని, నమ్మకాన్ని ప్రజలు కనబరచడంపట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరింత బలంగా తన ప్రయత్నాలతో ముందుకు వెళుతుందని, అవినీతిని సమూలంగా నిర్మూలించి అభివృద్ధి ఫలాలను ప్రతి పౌరుడికి అందేలా చేయకలుగుతుందని స్పష్టం చేశారు. 3 రోజులపాటు జపాన్ పర్యటనకు బయలుదేరిన మోదీ తాను తీసుకున్న ఈ నిర్ణయాన్ని సమర్థించుకుంటూ ప్రజల నుంచి వస్తున్న మద్దతును హర్షిస్తూ ట్వీట్ చేశారు. పెద్ద నోట్లు రద్దు కావడంతో వాటిని మార్చుకునేందుకు ప్రజలు ఎంతో ఉత్సాహంగా, సహనంతో, ఒక క్రమ పద్ధతిలో బ్యాంకులకు రావడం తనకు ఆనందం కలిగిస్తోందని, తమ ప్రయత్నాలకు సహకరించిన ఒక ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని మోదీ తెలిపారు. బ్యాంకులకు వచ్చే వృద్ధులకు అనేక మంది స్వచ్ఛందంగా సహాయపడటం కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిఒక్కరూ బలపరుస్తున్నారని చెప్పడానికి నిదర్శమని అన్నారు. రాబోయే జరగబోయే మంచికోసం ఈ తాత్కాలిక కష్టాన్ని, నష్టాన్ని భరించే సహనసీలత ప్రతి ఒక్కరిలో ద్యోతకం కావడం అభినందనీయమన్నారు.

కొత్త నోట్లు దక్కించుకున్న ఆనందంలో యువత