జాతీయ వార్తలు

అకస్మాత్తుగా రద్దు సరికాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/ చెన్నై, నవంబర్ 10: కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1,000 నోట్ల చలామణిని రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుసహా వివిధ కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. అత్యున్నత న్యాయస్థానంతోపాటు మద్రాసు, బొంబాయి హైకోర్టులో ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. సుప్రీంకోర్టులో దాఖలయిన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం గురువారం కేవియట్‌ను దాఖలు చేసింది. అత్యున్నత న్యాయస్థానం ఏదైనా చర్య తీసుకోవడానికి ముందు తన వాదన వినాలని కేంద్రం ఈ కేవియట్‌లో అభ్యర్థించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలయిన పిటిషన్‌పై ఈ నెల 15న వాదనలు వింటానని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. ఇదిలావుండగా, రూ.500, రూ.1000 నోట్ల చలామణిని రద్దుచేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలయిన ప్రజా ప్రయోజనాల పిటిషన్ (పిల్)ను విచారించడానికి మద్రాసు హైకోర్టు నిరాకరించింది. ద్రవ్య వ్యవస్థకు సంబంధించిన విధాన నిర్ణయాలలో తాను జోక్యం చేసుకోజాలనని మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం ఇండియన్ నేషనల్ లీగ్ ప్రధాన కార్యదర్శి ఎం.సీని అహ్మద్ దాఖలు చేసిన పిల్‌ను తోసిపుచ్చింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశ భద్రత, అభివృద్ధికి ఉపయుక్తంగా ఉందని తెలిపింది. ఇదే అంశంపై దాఖలయిన మరో పిల్‌ను కొట్టివేస్తూ, పెద్ద కరెన్సీ నోట్లు ఉగ్రవాదుల కార్యకలాపాలకు ఆర్థికంగా సహకరించడానికి, నల్లధనం పోగుపడటానికి ఉపయోగపడుతున్నాయని, ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థకు చేటుకలుగుతోందని మద్రాసు హైకోర్టు వ్యాఖ్యానించింది.
నోట్ల రద్దు విషయంలో కేంద్రం నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలయిన ఒక పిటిషన్‌ను స్వీకరించడానికి బొంబాయి హైకోర్టు వెకేషన్ బెంచ్ తిరస్కరించింది. చట్టాన్ని సవాలు చేస్తున్న పిటిషన్ అయినందున పిటిషనర్లు ఈ నెల 15 తరువాత రెగ్యులర్ బెంచ్‌ని ఆశ్రయించాలని సూచించింది.
కేంద్ర నిర్ణయాన్ని సవాలు చేస్తూ సంగం లాల్ పాండే అనే న్యాయవాది వ్యక్తిగత హోదాలో పిటిషన్ దాఖలు చేశారు. తగినంత సమయం ఇవ్వకుండా నోట్ల చలామణి రద్దువల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నందున తన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని ఆయన గురువారం న్యాయమూర్తి ఎఆర్ దవే నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని అభ్యర్థించారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రీ పిటిషన్‌కు నంబర్ కేటాయిస్తే, అది మంగళవారం లిస్టింగ్ కానివ్వండి అని ధర్మాసనం బదులిచ్చింది. రెండు పెద్ద నోట్ల చలామణిని రద్దు చేస్తూ జారీ చేసిన నోటిఫికేషన్‌ను కొట్టివేయాలని ఢిల్లీకి చెందిన న్యాయవాది వివేక్ నారాయణ్ శర్మ బుధవారం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిల్‌లో అభ్యర్థించారు. ఈ పిల్ ఈ వారంలో లిస్టింగ్ కానుంది.

తమ దగ్గరున్న నోట్లు చెల్లకపోవడంతో గురువారం చెన్నైలోని
రిజర్వు బ్యాంకుకు వద్దకు వచ్చి వివరాలు తెలుసుకుంటున్న విదేశీ కుటుంబం