జాతీయ వార్తలు

విద్యా వైజ్ఞానిక కేంద్రంగా ఏపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 10: ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ విద్యా, వైజ్ఞానిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక విజన్‌ను రూపొందించుకుని ముందు కు సాగుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
గురువారం ఢిల్లీలో జరిగిన 12వ ఫిక్కి ఉన్నత విద్యా శిఖరాగ్ర సమావేశంలో చంద్రబాబు ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిక్కితో రెండు అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకుంది. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఉన్నత విద్యా శాఖాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జాతీయ నాలెడ్జ్ ఫంక్షన్ హబ్‌ను ఏర్పాటు చేయటం, కొత్త రాజధాని అమరావతిలో ఫిక్కి సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ ఏర్పాటు చేసేందుకు ఒప్పందాలు కుదిరాయి. చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఫిక్కి అధికారులు అవగాహనా పత్రాలను ఇచ్చిపుచ్చుకున్నారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను పెంచేందుకు కావలసిన వౌలిక సదుపాయాలను కల్పించేందుకు తమ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు. ఉన్నత విద్యా రంగంలోకి ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని, తద్వారా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను బలోపేతం చేస్తున్నామని చెప్పారు.
రాష్ట్రంలో విద్యా సంస్థలను ఏర్పాటు చేసేందుకు పలు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు ముందుకు వచ్చాయి, కొన్ని స్వదేశీ విశ్వవిద్యాలయాలు కూడా తమ క్యాంపస్‌ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టాయని చంద్రబాబు తెలిపారు. విద్యా రంగంలో ఇన్నోవేషన్ స్టార్టప్ విధానాన్ని అమలుచేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రాన్ని విద్యా భాండాగారంగా మార్చేందుకు చేస్తున్న కృషిలో మీరంతా భాగస్వాములు కావాలని సమ్మిట్‌కు హాజరైనవారికి విజ్ఞప్తి చేశారు. గూగుల్ సిఈఓ, మైక్రోసాఫ్ట్ సిఈఓ ఇద్దరూ భారతీయులే. ఇది భారతీయతకు, మన యువశక్తికి నిదర్శమని ఆయన శ్లాఘించారు. టెక్నాలజీ, గణితం, ఇంగ్లీష్‌లో మనం ఎంతో సమర్థులం, ఐటిలో కూడా ఎంతో సమర్థులం కాబట్టి భవిష్యత్తు మనదేనని చంద్రబాబు చెప్పారు. వ్యవసాయ, విద్యుత్, ఐటి విప్లవం తరువాత ఇంటర్నెట్ విప్లవం రాబోతోందని అన్నారు. డ్రోన్లు, రొబోట్లు, డిజిటల్ టెక్నాలజీ అన్నింటిని మార్చివేశాయన్నారు. మిషీన్ లెర్నింగ్, సిసిటివి కెమెరాలు విప్లవం తెస్తాయి, ఎక్కడి నుంచైనా దేన్నైనా చూడవచ్చు. అది కూడా రియల్ టైమ్‌లోనేనని చంద్రబాబు చెప్పారు.
chitram...
ఢిల్లీలో గురువారం జరిగిన 12వ ఫిక్కి ఉన్నత విద్యా శిఖరాగ్ర
సమావేశంలో పాల్గొన్న ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు