జాతీయ వార్తలు

భారత్‌లో ఐఎస్ బలపడదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, డిసెంబర్ 27: ఉగ్రవాదులకు భారత్‌లో ఎప్పటికీ చోటు ఉండదని, దేశంలో ఐఎస్ ఎన్నటికీ బలపడబోదని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మన సంస్కృతీ సంప్రదాయాల విలువలు ఇందుకు పెద్ద అడ్డంకి అని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఐఎస్ ఉగ్రవాద సంస్థ భారత్‌లో వేళ్లూనడానికి ప్రయత్నించి విఫలమైందని, సమాజంలో బలంగా ఉన్న కుటుంబ విలువలే దీనికి కారణమని ఆయన అన్నారు. ‘ఈ రోజు ఐఎస్ గురించి ప్రపంచమంతా మాట్లాడుకొంటోంది. అయితే అది వేళ్లూనని దేశం ప్రపంచంలో ఏదయినా ఉందంటే అది భారత్ ఒక్కటే. భారతీయ సంస్కృతిలో ఉన్న కుటుంబ విలువలే దీనికి కారణం’ అని ఆదివారం లక్నోలో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ రాజ్‌నాథ్ అన్నారు. ఉగ్రవాద ప్రభావానికి లోనయిన ఓ యువకుడ్ని ముంబయిలో పట్టుకోవడం జరిగిందని, అయితే అతని తల్లిదండ్రులు తన వద్దకు వచ్చి తన కుమారుడ్ని కాపాడమని కోరారని ఆయన అంటూ, భారతదేశపు విలువలు ఇలాంటివని అన్నారు. అందువల్లనే ఐఎస్ మన దేశంలో ఎప్పటికీ ఆధిపత్యం సాధించలేదన్న గట్టి నమ్మకం తనకు ఉందని కూడా ఆయన అన్నారు. ఐఎస్‌కు వ్యతిరేకంగా ఇమామ్‌లు ప్రదర్శన నిర్వహించడం మన సంస్కృతి చేసిన అద్భుతమని కూడా ఆయన అన్నారు. ఈ విలువలను గనుక చెక్కుచెదరకుండా మనం కాపాడుకోగలిగితే భారత దేశం సూపర్‌పవర్‌గా మారడాన్ని ఎవరు కూడా ఆపలేరని రాజ్‌నాథ్ అన్నారు. భారతదేశం గణితం, వైద్య శాస్త్రం, ఖగోళ శాస్తల్రకు ఎన్నో అందించిందని, ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్ యూనివర్సిటీలకు పునాదులు పడడానికి ముందే మన దేశం ఒక విజ్ఞాన ఖనిగా ఉండిందని చెప్పారు.

లక్నోలోని వౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలో ఆదివారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్