రాష్ట్రీయం

నోట్ల రద్దుతో నకిలీకి చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 10: కేంద్రం ఐదు వందలు, వెయ్యి నోట్ల కరెన్సీని రద్దు చేయడంతో దేశ వ్యాప్తంగా ఉగ్రవాద నెట్‌వర్క్ నడ్డి విరిచినట్లయింది. ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా ముద్రపడిన హైదరాబాద్‌లో నకిలీ కరెన్సీ చలామణి ఎక్కువ. గత 35 రోజుల్లో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో నకిలీ కరెన్సీని చలామణి చేసే గ్యాంగులను పోలీసులు పట్టుకున్నారు. వివిధ కేసుల్లో 14 మంది నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ. 22 లక్షల నకిలీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ కరెన్సీని పాకిస్తాన్‌లో ముద్రించి బంగ్లాదేశ్ మీదుగా హైదరాబాద్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ నాలుగు గ్యాంగులను విచారిస్తే ఆసక్తికరమైన అంశాలు బహిర్గతమయ్యాయి. పశ్చిమబెంగాల్‌లోని మాల్దా నుంచి నకిలీ కరెన్సీని హైదరాబాద్‌కు తెచ్చి చలామణి చేశామని నిందితులు పోలీసులకు తెలిపారు. మరో గ్యాంగుకు చెందిన వ్యక్తి హైదరాబాద్ నివాసి. ఇతను కరాచీ నుంచి ఈ కరెన్సీ నోట్లను వివిధ మార్గాల ద్వారా హైదరాబాద్‌కు తెస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నకిలీ కరెన్సీ నోట్ల చలామణిలో సిద్ధ హస్తుడైన షకీర్ హుస్సేన్‌ను నేషనల్ ఇనె్వస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) గత ఏడాది అరెస్టు చేసింది. ఈ నిందితుడు ఐఎస్‌ఐ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నాడు.
బెంగళూరు, చెన్నై, కోచిలో నకిలీ కరెన్సీ నోట్ల చలామణి చేయడంలో ఈ నిందితుడు ప్రధాన సూత్రధారి. పోలీసులు ఇతని వద్ద నుంచి ఐదు లక్షల రూపాయల వరకు నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఈ నోట్లను పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ముద్రించినట్లు పోలీసులకు తెలిపాడు. పాకిస్తాన్ నుంచి హవాలా మార్గం ద్వారా నకిలీ కరెన్సీ దేశంలోకి వస్తోంది. 2014లో హైదరాబాద్‌లో పోలీసులు రూ.47.28లక్షల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. వీటిల్లో వెయ్యి నోట్లు 2703, ఐదు వందల నోట్లు 3289, వంద నోట్లు 3789, 50 రూపాయల కరెన్సీ 16 నోట్లు ఉన్నాయి. 2015లో పోలీసులు రూ. 25.81 లక్షల విలువైన కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. వీటిలో వెయ్యి నోట్లు 1686, ఐదు వందల కరెన్సీ 1428 నోట్లు, వంద నోట్లు 1810, 50రూపాయల నోట్లు 4 ఉన్నాయి. 2014లో పోలీసులు నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న వారిపై 54 కేసులను నమోదు చేసి 78 మందిని అరెస్టు చేశారు. 2015లో 20 కేసులు నమోదు చేసి 56 మందిని అరెస్టు చేశారు.
2015లో ఎన్‌ఐఏ మెదక్‌కు చెందిన మహ్మద్ రకీబ్‌తోసహా 15 మందిని అరెస్టు చేసింది. వీరు రూ.31.57 లక్షల నకిలీ కరెన్సీని చలామణి చేసేందుకు ప్రయత్నించారు. ఈ కేసులో నిందితులకు శిక్ష పడింది. ఈ నోట్లన్నీ వెయ్యి, ఐదు వందల కరెన్సీ కావడం గమనార్హం. దేశంలో చలామణి అవుతున్న నకిలీ కరెన్సీలో చాలా భాగం పాకిస్తాన్‌లోని ముజఫరాబాద్ ప్రింటింగ్ ప్రెస్‌లో ముద్రణ అవుతున్నాయని ఎన్‌ఐఏ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ముద్రించిన నకిలీ కరెన్సీని కరాచీ విమానాశ్రయానికి కట్టలు కట్టి పంపించి అక్కడ నుంచి బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి భారత్ సరిహద్దుల్లో ఉన్న బంగ్లాదేశ్ గ్రామాలకు తరలించి ఉగ్రవాద సంస్థల సానుభూతిపరులకు అందిస్తున్నారని ఎన్‌ఐఏ వివిధ సందర్భాల్లో కేంద్రానికి ఇచ్చిన నివేదికలో పేర్కొంది. నకిలీ కరెన్సీ నోట్లను ల్యాబ్ విశే్లషణ నిమిత్తం నాసిక్‌లోని సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌కు పంపుతారు. నాసిక్ ల్యాబోరేటరీ నిర్వహించిన విశే్లషణలో నకిలీ కరెన్సీ నోట్లలో 80 శాతం పాకిస్తాన్‌లోనే ముద్రించినట్లు వెల్లడైంది.