జాతీయ వార్తలు

రాష్ట్రాలదే అధికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 11: ప్రవేశ పన్ను విషయంలో రాష్ట్రాలకు విస్తృత ప్రయోజనం కలిగించే తీర్పును సుప్రీం కోర్టు ధర్మాసనం శుక్రవారం వెలువరించింది. తమ ప్రాంతంలోకి వచ్చే వస్తువులపై ప్రవేశ పన్ను విధించే హక్కు, అధికారం రాష్ట్రాలకు ఉందని తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం తెలిపింది. ఇందుకు సంబంధించి రాష్ట్రాలు ఇప్పటికే చేపట్టిన శాసనాలు రాజ్యాంగ బద్ధమేనని ఉద్ఘాటించింది. ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ సారధ్యంలోని తొమ్మిది మంది న్యాయమూర్తుల బెంచి ఇచ్చిన ఈ మెజార్టీ తీర్పును ఏడుగురు న్యాయమూర్తులు బలపరిచారు. ఇద్దరు ఆభ్యంతరం తెలిపారు. పన్నులకు సంబంధించి రాష్ట్రాలు చేపట్టే శాసనాలకు రాజ్యాంగంలోని 304 (బి) అధికరణ కింద రాష్టప్రతి ఆమోదం అవసరం లేదని కూడా సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వస్తువులపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలకు ఉన్నప్పటికీ వస్తువుల మధ్య ఎలాంటి తారతమ్యం చూపించకూడదని తెలిపింది. అంటే..రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే వస్తువులపై పన్ను విధించే రాష్ట్రాలు ఇదే రకమైన వస్తువులు ఇతర రాష్ట్రాల నుంచి వస్తే ఎక్కువ పన్ను విధించకూడదని తెలిపింది. స్థానిక ప్రాంతం అన్న నిర్వచన పరిధిలోకి మొత్తం రాష్ట్రం వస్తుందా లేక ఆ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలే వస్తాయా అన్న విషయాన్ని సాధారణ ధర్మాసనాలు తేల్చాలని మెజార్టీ తీర్పులో న్యాయమూర్తులు తెలిపారు. మెజార్టీ తీర్పును బలపరిచిన వారిలో న్యాయమూర్తులు ఎకె సిక్రీ, ఎస్‌ఎ బాబ్డే,ఎస్‌కె సింగ్, ఎన్‌వి రమణ, ఆర్ భానుమతి, ఎఎమ్ ఖన్‌వాలికర్‌లు ఉన్నారు. జస్టీస్ డివై చంద్రచూడ్,అశోక్ భూషణ్‌లు విడిగా మైనార్టీ తీర్పును వెలువరించారు. ఈ మైనార్టీ తీర్పును బలపరుస్తూ జస్టీస్ భానుమతి విడిగా తీర్పునిచ్చారు. తన అభిప్రాయంలో స్థానిక ప్రాంతం అన్నది మొత్తం రాష్ట్రానికే వర్తిస్తుందన్నారు.
ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రంలోకి ప్రవేశించే వస్తువులపై ప్రభుత్వాలు పన్ను విధిస్తాయి. అంటే ఏ రాష్ట్రంలోకి వస్తువులు ప్రవేశిస్తాయో ఆ రాష్ట్రం ఎంట్రీ టాక్స్ విధిస్తుంది. అయితే, రాజ్యాంగంలోని 301 అధికరణ ప్రకారం ప్రవేశ పన్ను చెల్లదని, ఇది స్వేచ్ఛా వ్యాపార వాణిజ్యాలకు వ్యతిరేకమని పలు కంపెనీలు సవాలు చేశాయి. ఈ సుదీర్ఘ విచారణలో భాగంగా సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను పరిశీలించింది. అనంతరం ఈ కేసు విస్తృత ధర్మాసన పరిశీలనకు వచ్చింది.