జాతీయ వార్తలు

నోట్లు మార్చుకునేందుకు క్యూలో రాహుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 11: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం బడా పారిశ్రామికవేత్తలు, ధనవంతుల కోసం పని చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. రాహుల్ గాంధీ శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో పార్లమెంటు వీధిలోని ఎస్‌బిఐ శాఖకు వెళ్లి నాలుగు వేల పాత నోట్లను కొత్త నోట్లుగా మార్చుకునేందుకు క్యూలో నిలబడి సంచలనం సృష్టించారు. ఆయన పార్లమెంటు వీధిలో పోలీసు స్టేషన్ పక్కన ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖకు వచ్చి నోట్లు మార్చుకునేందుకు లైనులో నిలబడటంతో గందరగోళం నెలకొన్నది. బ్యాంకులో అప్పటికే వందలాదిమంది లైన్లలో ఉన్నారు. రాహుల్ వెళ్లి లైనులో నిలబడగానే భద్రతా సిబ్బంది అక్కడికి వచ్చి ఆయనను లోపలికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ఆయన మాత్రం లోపలికి వెళ్లేందుకు నిరాకరించారు. అందరి మాదిరిగానే తానుకూడా లైనులో నిలబడి డబ్బు మార్చుకుంటానని భద్రతా సిబ్బందికి స్పష్టం చేశారు. రాహుల్ వెంట వచ్చిన లోక్‌సభ సభ్యురాలు సుస్మితా దేవ్, మరో ఎంపికూడా లైనులో నిలబడ్డారు. రాహుల్ గాంధీతో సెల్ఫీలు దిగేందుకు లైనులో నిలబడిన వారు ప్రయత్నించటంతో కొంత గందరగోళం, తోపుపాట నెలకొన్నది.
ఈ దశలో భద్రతా సిబ్బంది మరోసారి జోక్యం చేసుకుని ఆయనను లోపలికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే రాహుల్ గాందీ మాత్రం భద్రతా సిబ్బంది మాట వినకుండా ‘ప్రజలు కష్టపడుతుంటే నేను వేరుగా వెళ్లి డబ్బు ఎలా మార్చుకుంటాను’ అని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసే ముందు సామాన్య ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చూసేందుకు అవసరమైన చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు. ఈ దశలో ఆయన వద్దకు వచ్చి మీడియా ప్రతినిధులు ప్రశ్నలు కురిపించటం ప్రారంభించటంతో రాహుల్ విసుక్కున్నారు. తాను సగటు మనిషి మాదిరిగా లైనులో నిలబడి డబ్బు మార్చుకుంటానని మరోసారి చెప్పారు. ప్రజల సమస్యలు నరేంద్ర మోదీకి, మీడియాకు అర్థం కావటం లేదని ఆయన విమర్శించారు. నోట్ల మార్పిడి కోసం ప్రజలు ఏ స్థాయిలో ఇబ్బంది పడుతున్నారనేది మీకు అర్థం కాదంటూ అక్కడే ఉన్న ఒక యువకుడిని ముందుకు తెచ్చి ఈయన బాధేమితో మొదట తెలుసుకోండి అంటూ మీడియాకు క్లాస్ తీసుకున్నారు. ఆ యువకుడు మాట్లాడుతూ పెద్ద నోట్లు రద్దు కావటంతో తన పెళ్లి ఆగిపోయే ప్రమాదం నెలకొన్నదన్నారు. తాను ఒకవైపు పెళ్లి పత్రికలు పంచుతూనే మరోపక్క డబ్బు సమకూర్చుకునేందుకు ఇలా బ్యాంకు క్యూలో నిలబడ వలసి వస్తోందంటూ తన బాధను వ్యక్తం చేశారు. క్యూలో నిలబడిన పలువురు యువకులు కూడా నోట్లు మార్చుకునేందుకు చాలా కష్టపడవలసి వస్తోందని చెప్పారు. ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ దాదాపు గంట పాటు క్యూలో నిలబడి నాలుగువేల పాత రూపాయలకు కొత్త నోట్లు తీసుకుని వెళ్లారు.