జాతీయ వార్తలు

తిప్పలు తీరేదెన్నడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యాంకులు కిటకిట..
కరెన్సీకి కటకట

ఎటిఎంల ముందు వేలాదిగా బారులు చాలాచోట్ల తెరుచుకోని ఎటిఎంలు
కొత్త 500 నోటు జాడే లేదు 2వేల నోటుతో దిక్కుతోచని జనం
చెల్లింపులకు 14వరకూ పాత నోట్లే మరో రెండు రోజులు ‘నో’టోల్
కేంద్ర నిర్ణయంతో స్వల్ప ఊరట కావాల్సినంత క్యాష్: ఆర్‌బిఐ భరోసా

న్యూఢిల్లీ, నవంబర్ 11:పెద్ద నోట్ల రద్దు రెండో రోజూ జన జీవనాన్ని అతలాకుతలం చేసింది. క్యాష్ పుష్కలమంటూ రిజర్వ్ బ్యాంక్ భరోసా ఇచ్చినా ఎక్కడా ఎటిఎమ్‌లు తెరుచుకోలేదు. తెరుచుకున్నవీ పూర్తిగా పనిచేయలేదు. దేశ వ్యాప్తంగా 1000, 500 నోట్లు రావడానికే వీలున్న ఎటిఎమ్‌లలో 2వేల నోటు వచ్చే విధంగా సాంకేతిక మార్పు జరుగలేదు. పరిస్థితి కుదుట పడాలంటే మరోపది రోజుల వరకూ పడుతుందని ఎస్‌బిఐ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో పెద్ద నోట్ల మార్పిడి కోసం శుక్రవారం జనం పడ్డ తంటాలు వర్ణణాతీతం. దేశ వ్యాప్తంగా పల్లె పట్టణం అన్న తేడా లేకుండా అన్ని చోట్లా బ్యాంకుల ముందు వందల సంఖ్యలో బారులు తీరారు. చేతిలో చిల్లి పైసా లేకపోవడంతో ఎలాగైనా సరే పెద్ద నోట్లను మార్చుకునేందుకు గంటల తరబడి క్యూలోనే నిలబడాల్సిన అనివార్య పరిస్థితి లక్షలాది మందికి ఏర్పడింది. అనుతున్న స్థాయిలో కొత్త నోట్లు అందుబాటులోకి రాకపోవడంతో ఈ నెల 14 వరకూ పాత నోట్లతోనే అన్ని రకాల చెల్లింపులూ జరుపవచ్చునని కేంద్రం ప్రకటించింది. అలాగే 14 అర్థరాత్రి వరకూ టోల్ పన్ను విధించబోమని వెల్లడించింది. అన్ని విధాలుగా నగదు కొరతతో కొట్టు మిట్టాడిన జనానికి ఈ నిర్ణయం కొంత ఊరట నిచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద నోట్ల రద్దు సామాన్యుల జీవనాన్ని, జీవితాన్ని రెండో రోజూ మరింతగా ఇబ్బందుల పాలు చేసింది. అధికారులు చెప్పినట్టుగా ఎటిఎమ్‌లు పూర్తి స్థాయిలో పనిచేసిన దాఖలాలు లేవు. చాలా చోట్ల ఇవి తెరుచుకోనే లేదు. పెద్ద నోట్లను మార్చుకోవాలంటే ఆధార లేదా పాన్ లేదా ఇతర జిరాక్స్ అవసరం ఒక వైపు..తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష కారణంగా జిరాక్స్ కేంద్రాల్ని మూసేయడం మరో వైపుప్రజలకు ప్రత్యక్ష నరకానే్న చూపించాయి. ప్రధాని మోదీ నిర్ణయం మాట ఎలా ఉన్నా గత 48 గంటల్లో సామాన్యులు మొదలుకుని సంపన్నుల వరకూ కల్లో కూడా ఊహించని ఇక్కట్లనే ఎదుర్కొన్నారు. మరింతగా ఏర్పాట్లను ముమ్మరం చేయడం, ఎటిఎమ్‌లను మాటల్లో కాకుండా చేతల్లో పని చేయించడం వల్లే పరిస్థితి మెరుగవుతుందన్న అభిప్రాయం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతోంది. మరో పక్క గత తొమ్మిది నెలల్లో ఎన్నడూ లేని రీతిలో సెనె్సక్స్ ఏకంగా 699పాయింట్లు పడిపోయింది. అమెరికా కొత్త అధ్యక్షుడిగా ట్రంప్ అనుసరించే విధానాల భయమే ఇందుకు దారితీసింది. అలాగే పెద్ద నోట్ల రద్దు ప్రభావమూ ఇందుకు ప్రధాన కారణమైంది.