అంతర్జాతీయం

బుల్లెట్ రైలులో ప్రయాణించిన మోదీ, అబె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో, నవంబర్ 12: జపాన్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఆ దేశ ప్రధాని షింజే అబెతో కలిసి బులెట్ ట్రైన్‌లో ప్రయాణం చేశారు. జపాన్‌లోని ప్రఖ్యాత హైస్పీడ్ రైలు షింకన్‌సేన్ బులెట్ రైల్లో టోక్యోనుంచి ఒసాకా తీరంలోని కోబె నగరం దాకా ప్రయాణించారు. అబెతో కలిసి బులెట్ రైల్లో ప్రయాణించిన ఫోటోను మోదీ ట్విట్టర్‌లో పెట్టారు. విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ కూడా ఈ ఫోటోలను ట్విట్టర్‌లో ఉంచారు. షింకన్‌సేన్ టెక్నాలజీతో భారత్‌లో కూడా ముంబయి-అహ్మదాబాద్ మధ్య బులెట్ రైలును ప్రవేశ పెట్టాలనే ప్రతిపాదన ఉన్న విషయం తెలిసిందే. ఈ రైలు గంటకు 240 నుంచి 320 కి.మీ. వేగంతో ప్రయాణించగలదు. రైలులో ప్రయాణిస్తూ ఇరువురు ప్రధానులు అనేక విషయాలను చర్చించారు. అలాగే మోదీ కొద్ది సేపు డ్రైవర్ క్యాబిన్‌లో కూర్చుని సిస్టమ్‌ను పరిశీలించారు. ముంబయి-అహ్మదాబాద్ హైస్పీడ్ ట్రైన్ కారిడార్ నిర్మాణం 2018లో ప్రారంభమై 2023కల్లా పూర్తవుతుందని భావిస్తున్నారు.

జపాన్ ప్రధాని అబెతోపాటు బుల్లెట్ రైలులో ప్రయాణించిన ప్రధాని నరేంద్ర మోదీ,
రైలు క్యాబిన్‌లో దాని పనితీరును పరిశీలించారు