అంతర్జాతీయం

మహా అయితే ఏడాది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, నవంబర్ 12: అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా పదవీ బాధ్యతలు చేపట్టకుండానే ఆయనను ఎంతోకాలం అధ్యక్షుడిగా ఉంచరన్న కథనాలు విస్తృతంగా వ్యాపించాయి. సొంత పార్టీ రిపబ్లికన్ పార్టీనే ట్రంప్‌కు అభిశంసన చెప్పేసి మరొక నేతను అధ్యక్షుడిగా చేస్తుందని అమెరికాకు చెందిన ఓ ప్రొఫెసర్ జోస్యం చెప్పారు. డోనాల్డ్ ట్రంప్ అమెరికా అగ్రరాజ్యానికి అధ్యక్షుడు అవుతారని జోస్యం చెప్పిన ప్రొఫెసర్ అలెన్ లిచ్‌మాన్‌నే ఇప్పుడీ ప్రచారానికి తెరలేపారు. ఒక్కసారి అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తే ట్రంప్‌ను ఆపడం ఎవరి తరమూ కాదని పార్టీ భయపడుతున్నట్టు ఆయన తెలిపారు. ఈ దృష్ట్యా 70 ఏళ్ల డొనాల్డ్‌కు ఉద్వాసన పలికి మైక్ పెన్స్‌కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని రిపబ్లికన్ పార్టీ అధినాయకత్వం భావిస్తోందని లిచ్‌మాన్ చెప్పారు. లిచ్‌మాన్ జోస్యాన్ని ఉటంకిస్తూ వాషింగ్టన్ పోస్ట్ కథనాలు ప్రచురించింది. ‘ట్రంప్ అధ్యక్ష పీఠంపై కూర్చుంటే ఆ దూకుడును ఎవరూ ఆపలేరు. అందుకే ఎటుతిరిగి ఎటు వస్తుందోనన్న ఆందోళన రిపబ్లికన్ పార్టీలో ఉంది. పార్టీకి అత్యంత నమ్మకస్తుడైన పెన్స్‌కు అధ్యక్షపదవి కట్టబట్టేందుకు ఏ మాత్రం వెనకాడరు’ అని లిచ్‌మాన్ స్పష్టం చేశారు. మహాఅయితే ట్రంప్ ఏడాది కన్నా ఎక్కువ రోజులు పదవిలో ఉండరని న్యూయార్క్ టైమ్స్ కాలమిస్టు డేవిడ్ బ్రూక్స్ తెలిపారు. ‘దుందుడుకు స్వభావం, మత వ్యతిరేక వ్యాఖ్యలు, హామీల ఉల్లంఘన కచ్చితంగా ట్రంప్‌కు ప్రతికూలమే అవుతుంది’ అని బ్రూక్స్ పేర్కొన్నారు.
ఇవి గడ్డురోజులే: హిల్లరీ క్లింటన్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల తరువాత ప్రచారకర్తలు, వలంటీర్లను ఉద్దేశించి హిల్లరీ మాట్లాడుతూ, మన దేశానికి ఇవి గడ్డురోజులు. ఎన్నికల ఫలితాలు, తదనంతర పరిణామాలపై ప్రజలు స్పందన ఏమిటో చూడాలి. వారి ఆశలకు అనుగుణంగా పాలన ఉంటుందా లేదా అన్నది చాలా జాగ్రత్తగా గమనిద్దాం అని పార్టీ శ్రేణులను ఉద్దేశించి అన్నారు.
ఎక్కడ లోపం జరిగిందో అనే్వషించాలని ఆమె పిలుపునిచ్చారు. హిల్లరీ 15 నిముషాల ప్రసంగంలో పార్టీ మద్దతుదారుల కృషిని ప్రశసించారు. ట్రంప్ గెలుపును అత్యధిక అమెరికన్లు జీర్ణించుకోలేకపోతున్నారని హిల్లరీ ప్రచార సారధి రాబే మూక్ అన్నారు. తాజా పరిణామాలు ఒక రకంగా అమెరికాకు, అలాగే ప్రపంచానికే క్లిష్టమైన రోజులేనని ఆయన పేర్కొన్నారు.

అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయన డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న మహిళలు.
మరోవైపు ఆయన గెలుపును స్వాగతిస్తూ ప్రదర్శనలు జరుపుతున్న మద్దతుదారులు