జాతీయ వార్తలు

హెల్ప్ సంస్థకు జాతీయ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 14: బాలల హక్కుల పరిరక్షణకు విశేష కృషి చేసినందుకు గాను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ హెల్ప్ కార్యదర్శి నిమ్మరాజు రామ్మోహన్‌కు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ కేంద్రప్రభుత్వం ఇచ్చే ప్రతిష్ఠాత్మకమైన జాతీయ అవార్డును అందజేశారు.
జాతీయ బాలల దినోత్సవం సంధర్భంగా సోమవారం రాష్టప్రతి భవన్‌లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో బాలల సర్వతోముఖాభివృద్ధికోసం కృషి చేసిన స్వచ్ఛంద సంస్థలకు ప్రణబ్ ముఖర్జీ జాతీయ అవార్డులను బహూకరించారు. రాష్టప్రతి చేతుల మీదుగా జాతీయ అవార్డును అందుకున్న హెల్ప్ సంస్థను 1993లో కొందరు పత్రికా విలేఖరులు కలిసి ప్రారంభించారు. రామమోహన్ కార్యదర్శిగా ఉన్న ఈ స్వచ్ఛంద సంస్థకు ఏపి, తెలంగాణాలో పదమూడు శాఖలున్నాయి. ఈ సంస్థ బాలల హక్కుల పరిరక్షణ కోసం ప్రధానంగా పని చేస్తోంది. పడుపువృత్తిలో కూరుకుపోయిన పలువురు బాలికలకు ఈ సంస్థ పునరావాసం కల్పించిందని హెల్ప్ కార్యదర్శి రామమోహన్ రావు చెప్పారు. ఇలాంటి అభాగ్యుల పిల్లల కోసం ప్రత్యేక పాఠశాలలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.
chitram..
సోమవారం రాష్టప్రతి భవన్‌లో రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా జాతీయ అవార్డును స్వీకరిస్తున్న స్వచ్ఛంద సంస్థ
హెల్ప్ కార్యదర్శి నిమ్మరాజు రామ్మోహన్