అంతర్జాతీయం

న్యూజిలాండ్‌లో ఇదే అతిపెద్ద భూకంపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైస్ట్‌చర్చ్ (న్యూజిలాండ్), నవంబర్ 14: న్యూజిలాండ్‌లో ఆదివారం సంభవించిన భూకంపం పెను విధ్వంసాన్ని సృష్టించింది. ఇప్పటికి ఇద్దరు మృతిచెందారు. ప్రతికూల వాతావరణానికితోడు చీకట్లు అలుముకోవడంతో సహాయ కార్యక్రమాలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. తరచుగా భూకంపాలు సంభవించే న్యూజిలాండ్‌లో ఇప్పటివరకూ నమోదైన అతిపెద్ద ప్రకంపన ఇదే. న్యూజిలాండ్ దక్షిణ దీవిలోని సముద్రతీర పర్యాటక పట్టణమైన కైకొవురాకు సమీపంలో ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత ఈ భూకంపం సంభవించింది. దీంతో సునామీ సంభవించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించడంతో వేలాది మంది ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. దాదాపు 2 వేల మంది నివసిస్తున్న కైకొవురాలో ఈ భూకంపం ధాటికి పలుచోట్ల మట్టిపెళ్లలు విరిగిపడి రోడ్లు తెగిపోవడం, టెలికమ్యూనికేషన్ వ్యవస్థ నాశనమవడంతో ఆ ప్రాంతానికి ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో సహాయ సిబ్బందిని హెలికాప్టర్ల ద్వారా తరలించాల్సి వస్తోందని, నష్టాన్ని అంచనా వేసే పనులు చాలా నెమ్మదిగా సాగుతున్నాయని న్యూజిలాండ్ పౌర రక్షణ శాఖ మంత్రి గెర్రీ బ్రౌన్లీ తెలిపారు. ఈ భూకంపం సంభవించిందన్న సమాచారం తమకు ఇప్పుడే అందిందని, దీని ధాటికి చాలామంది తీవ్రంగా గాయపడి ఉంటారని, ప్రాణ నష్టం అధికంగా ఉండవచ్చని భావిస్తున్నామని ఆయన చెప్పారు.