జాతీయ వార్తలు

వందకు ఢోకా లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 16: ఐదొందలు, వెయ్యి రూపాయల నోట్లు రద్దయిన నేపథ్యంలో 50, 100 నోట్ల చెలామణి కూడా రద్దవుతుందంటూ వ్యాపిస్తున్న వదంతులను కేంద్రం ఖండించింది. ఈ వదంతులన్నీ అభూత కల్పనలేనని, వీటిని రద్దు చేసే యోచన తమకు ఎంత మాత్రం లేదని బుధవారం స్పష్టం చేసింది. 100, 50 రూపాయలే కాదు ఇతర విలువ కలిగిన కరెన్సీలను రద్దు చేసే ఆలోచన ఎంత మాత్రం లేదని తెలిపింది. అలాగే బ్యాంకు లాకర్లను మూసివేయాలన్న ఉద్దేశం గానీ, బంగారం, డైమండ్ ఆభరణాలను దిగ్బంధం చేసే ఆలోచన గానీ లేదని వెల్లడించింది. 2వేల నోట్ల నాణ్యత విషయంలో తలెత్తుతున్న ఆందోళనలనూ తొలగించింది. బట్టతో రుద్దితే ఈ నోటు రంగు పోవడానికి టర్బో ఎలక్ట్రిక్ ఎఫెక్టే కారణమని, ఇది కూడా ఈ నోటు భద్రతా లక్షణాల్లో ఒకటని వివరించింది. ఈ నోటులో చిప్ ఉందన్న కధనాలూ కట్టుకధలేనని కొట్టిపారేసింది. నోట్ల రద్దు గురించి ముందే సమాచారం పొక్కిందన్న వాదనలోనూ నిజం లేదని, చివరి క్షణం వరకూ దీన్ని అత్యంత గోప్యంగానే ఉంచామని తెలిపింది.