జాతీయ వార్తలు

అన్నింటినీ చర్చిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 16: అన్ని అంశాలను చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అంతేకాదు శీతాకాల సమావేశాల్లో సభా కార్యకలాపాల అజెండాను పూర్తి చేయడానికి అన్ని రాజకీయ పార్టీలు తమ వంతు తోడ్పాటునందిస్తాయన్న ఆశాభావాన్ని సైతం ఆయన వ్యక్తం చేశారు. పెద్ద నోట్ల రద్దు వ్యవహారాన్ని పార్లమెంటు ఉభయ సభల్లో లేవనెత్తాలని ప్రతిపక్షాలన్నీ నిర్ణయించిన నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలి రోజయిన బుధవారం లోక్‌సభ వాయిదాపడిన తర్వాత పార్లమెంటు వెలుపల మీడియాతో ప్రధాని ముచ్చటిస్తూ పార్టీల రాజకీయ సిద్ధాంతాలు, సామాన్యుడి ఆశలు, ఆకాంక్షలు, ప్రభుత్వ ఆలోచనల ఆధారంగా అన్ని అంశాలపైన సభలో చాలా మంచి చర్చ జరుగుతుందని తాను ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. గత సమావేశాల్లో జిఎస్‌టిపై ఒక కీలక నిర్ణయం తీసుకోవడం ద్వారా ‘ఒకే దేశం, ఒకే పన్ను’ కలను సాకారం చేసే దిశగా పార్లమెంటు ఓ ముందడుగు వేసిందని మోదీ అంటూ, అప్పుడు కూడా తాను అన్ని పార్టీలకు కృతజ్ఞతలు చెప్పినట్లు తెలిపారు.
లోక్‌సభ వాయిదా
పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌బిహార్ నియోజకవర్గం నుండి ఎన్నికైన రేణుకా సిన్హాతోపాటు ఆరుగురు మాజీ ఎంపీల మరణం పట్ల సంతాపం తెలిపిన అనంతరం లోక్‌సభ రేపటి వరకు వాయిదా పడింది. స్పీకర్ సుమిత్రా మహాజన్ బుధవారం ఉదయం పదకొండు గంటలకు సభలో మొదట సంతాపం తీర్మానాలు చేపట్టారు. లోక్‌సభ ప్రస్తుత సభ్యురాలు రేణుకా సిన్హా, ఆరుగురు మాజీ ఎంపీలు వి.జయలక్ష్మి, ఆరిఫ్ బేగ్, పి.కన్నన్, హర్షవర్దన్, జయవంతీ మెహతా, ఉషా వర్గాల మృతి పట్ల సంతాపం తెలుపుతూ సభ్యులు రెండు నిమిషాల పాటు వౌనం వహించారు. ఇజ్రాయిల్ మాజీ రాష్టప్రతి షిమోన్ పెరేజ్, థాయిలాండ్ రాజు భూమిబల్ అద్యుల్యదేజ్ మరణం పట్ల కూడా లోక్‌సభ సంతాపం తెలిపింది. మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరటంతోపాటు వారి కుటుంబ సభ్యులకు తమ విచారాన్ని తెలిపిన అనంతరం సభ రేపు ఉదయం వరకు వాయిదా పడింది.