జాతీయ వార్తలు

జిరాక్స్ అక్కర్లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 16: పెద్దనోట్ల మార్పిడి, విత్‌డ్రాల కోసం ఖాతాదారులు పడుతున్న ఇబ్బందులు, అస్తవ్యస్త పరిస్థితులను చక్కదిద్దడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
పెద్దనోట్ల మార్పిడికి గుర్తింపుకార్డు జిరాక్స్ కాపీ ఇవ్వనక్కర్లేదని ఆర్‌బిఐ ప్రకటించింది. ఒరిజినల్ గుర్తింపుకార్డు చూపిస్తే సరిపోతుందని పేర్కొంది. ఈ మేరకు ఆర్‌బిఐ కరెన్సీ మార్చుకునేందుకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. ఖాతాదారులు ఇబ్బందుల దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. పెద్దనోట్ల మార్చుకునేందుకు ఒరిజినల్ గుర్తింపుకార్డు చూపిస్తే చాలని, జిరాక్స్ కాపీ ఇవ్వనక్కర్లేదని తెలిపారు.
వచ్చినవారే మళ్లీ వచ్చి నోట్లు మార్చుకుంటున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దాన్ని నివారించేందుకు అధికారులు చర్యలు చేపట్టినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. సిండికేట్‌లు చెక్‌పెట్టేందుకు పెద్ద నగరాల్లో సిరా మార్కు పెట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

చిత్రం... ఆర్బీఐ ఆదేశాల మేరకు కొత్త నోట్లు ఇచ్చివేలిపై బ్యాంకులు వేస్తున్న ఇంక్ ముద్రను చూపిస్తున్న ఓ మహిళ