జాతీయ వార్తలు

మీరు జోక్యం చేసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్ద నోట్లరద్దుపై రాష్టప్రతికి పార్టీల విజ్ఞప్తి
ప్రజల ఇబ్బందులను తొలగింపచేయండి: శివసేన
రద్దు వెనుక పెద్ద కుట్ర: మమతా బెనర్జీ
రాష్టప్రతి భవన్‌కు 4 పార్టీల నేతల మార్చ్

న్యూఢిల్లీ, నవంబర్ 16: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్.డి.ఏ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరింపజేయాలని తృణమూల్ కాంగ్రెస్. ఎన్.సి, ఆం ఆద్మీ పార్టీల నాయకులు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని కోరారు. పెద్ద నోట్ల రద్దు మూలంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు తగు చర్యలు తీసుకోవాలని శివసేన నాయకులు ప్రణబ్ ముఖర్జీని కోరారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ నాయకత్వంలో శివసేన, నేషనల్ కాన్ఫరెన్స్, ఆం ఆద్మీ పార్టీ సీనియర్ నాయకులు, పార్లమెంటు సభ్యులు పార్లమెంటు నుండి రాష్టప్రతి భవన్ వరకు బుధవారం మార్చ్ నిర్వహించిన అనంతరం రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని కలిసి వినతిపత్రాలు సమర్పించారు. తృణమూల్ కాంగ్రెస్, ఎన్.సి, ఆం ఆద్మీ పార్టీల నాయకులు పెద్ద నోట్ల రద్దును ఉపసంహరింపజేయాలనగా, ఎన్.డి.ఏ భాగస్వామ్య పార్టీ శివసేన మాత్రం పెద్ద నోట్ల రద్దు మూలంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించటం గమనార్హం. మమతా బెనర్జీ, లోక్‌సభలో టి.ఎం.సి పక్షం నాయకుడు సుదీప్ బందోపాధ్యాయ, రాజ్యసభలో పార్టీ సీనియర్ నాయకుడు డెరిక్ ఓబ్రేన్, ఎన్.సి అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా, శివసేన నాయకుడు సంజయ్ రౌత్, ఆం ఆద్మీ పార్టీ లోక్‌సభ సభ్యుడు భగవంత్‌సింగ్ మాన్‌తోపాటు దాదాపు పదిహేను మంది ప్రజాప్రతినిధులు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. పెద్ద నోట్ల రద్దు వలన దేశంలోని కోట్లాది మంది ప్రజలు అనేక ఇబ్బందుల్లో పడిపోయారని, పెళ్లిల్లు ఆగిపోయాయని, ప్యాపారాలు నిలిచిపోయాయని, మొత్తం ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయిందని మమతా బెనర్జీ రాష్టప్రతికి వివరించారు. పెద్ద నోట్ల రద్దు వెనుక పెద్ద కుట్ర ఉన్నదని ఆమె ఆరోపించారు. ఎన్.డి.ఏ ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోవాలని ఆమె ప్రణబ్ ముఖర్జీకి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ నిర్ణయం వలన సమాజంలోని బడుగు బలహీన వర్గాలు, బీద ప్రజలు నానా కష్టాలు పడుతున్నారని, వారు కష్టపడి సంపాదించుకున్నదంతా ప్రభుత్వ నిర్ణయం వలన కొట్టుకుపోయిందని మమతా బెనర్జీ రాష్టప్రతికి వివరించారు. బడా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం నిర్ణయం వలన ఎలాంటి ఇబ్బంది లేదని, వారు తమ వద్ద ఉండిన నల్లధనాన్ని ఎప్పుడో తెల్ల ధనంగా మార్చుకున్నారని వారన్నారు. ఎన్.డి.ఏ ప్రభుత్వాధినేతలు పెద్ద నోట్ల రద్దు గురించి తమ సన్నిహితులకు ముందే తెలియజేశారని మమతా బెనర్జీ ఆరోపించారు.
ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయటం వలన నల్ల ధనాన్ని నిల్వచేసుకున్న వారికి ఎలాంటి నష్టం కలగలేదని, కానీ సామాన్య జనం మాత్రం నానా ఇబ్బందులకు గురి అవుతున్నారని నాలుగు పార్టీల నాయకులు రాష్టప్రతికి వివరించారు. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ వారు చెప్పినదంతా సావకాశంగా విన్న తరువాత ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవలసిందిగా ప్రభుత్వానికి సూచిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిసింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వానికి సూచించే అంశంపై ప్రణబ్ ముఖర్జీ ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదని చెబుతున్నారు.

నోట్లరద్దు నిర్ణయాన్ని ఉపసంహరింపజేయాలని కోరుతూ రాష్టప్రతికి వినతి పత్రం అందజేస్తున్న మమతా బెనర్జీ, తదితరులు

నేడు లోక్‌సభలో టిఎంసి వాయిదా తీర్మానం
పెద్ద నోట్ల రద్దు తరువాత ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా చూసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయటంలో ఎన్.డి.ఏ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మమతా బెనర్జీ రాష్టప్రతిని కలిసిన అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ దుయ్యబట్టారు. పెద్ద నోట్లను రద్దు చేయటం వలన ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రాష్టప్రతికి వివరించి సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఆమె తెలిపారు. యు.పి.ఏ హయాంలో ఆర్థిక మంత్రిగా పని చేసిన ప్రణబ్ ముఖర్జీ దేశ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటారనే పూర్తి విశ్వాసం తమకు ఉన్నదని మమతా బెనర్జీ చెప్పారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు రేపు లోక్‌సభలో పెద్ద నోట్ల అంశంపై వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదిస్తారని ఆమె తెలిపారు. ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేయటంలో విఫలమైందని నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా చెప్పారు. దేశం మొత్తం జనాభా నుండి కేవలం నాలుగు శాతం మంది మాత్రమే క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారని ఆయన తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికపై చర్యలు తీసుకోవాలని శివసేన నాయకుడు చంద్రకాంత్ ఖైరె డిమాండ్ చేశారు. నల్ల ధనం, అవినీతిని తామెవ్వరం సమర్థించటం లేదని, వీటిని అరికట్టవలసిందేనని, అయితే దీని కోసం దేశంలోని కోట్లాది మంది ప్రజలను ఇబ్బందులకు గురి చేయటం మంచిది కాదని ఈ పార్టీల నాయకులు స్పష్టం చేశారు.