జాతీయ వార్తలు

నకిలీ నోట్లను గుర్తించలేక..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్, నవంబర్ 16: ఒడిశా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెనె్నముక అయిన పల్లెల్లోని పోస్ట్ఫాసులు నకిలీ కరెన్సీని గుర్తించే యంత్రాలు లేక చాలా సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. నగదును మార్చుకునేందుకు వచ్చిన వారు తెచ్చే రద్దయిన నోట్లలో నకిలీవి గుర్తించే యంత్రాలు పోస్ట్ఫాసులకు చేరలేదు. కొద్దో గొప్పో ఉన్నవి సరిగా పనిచేయలేదు. దీంతో నగదు మార్పిడి చాలా ఆలస్యమైపోయింది. జగత్సింగ్‌పూర్, కేంద్రాపారా జిల్లాల్లోని దాదాపు 700 పోస్ట్ఫాసుల దగ్గర ప్రజలు గంటల తరబడి కొత్త నోట్ల కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. అక్కడ ఉన్న యంత్రాల్లో ఏ నోటును ఉంచినా తిరస్కరిస్తుండటంతో పలుచోట్ల నగదు మార్పిడిని సిబ్బంది నిరాకరించారు. దీంతో ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.