జాతీయ వార్తలు

మరోనెల ఇబ్బందులు తప్పవు: రాజ్‌నాథ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేవారీ (హర్యానా), నవంబర్ 16: పెద్దనోట్ల రద్దువల్ల ఖాతాదారులకు మరోనెల రోజులు ఇబ్బందులు తప్పవని కేంద్ర హోమ్‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. బుధవారం ఇక్కడొక సభలో మాట్లాడిన రాజ్‌నాథ్ నల్లధనాన్ని ఏరివేయడానికి కఠినమైనా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ప్రజలు కొంత ఇబ్బంది పడుతున్నా భవిష్యత్‌లో మంచి ఫలితాలుంటాయని అభిప్రాయపడ్డారు. మంచి ఉద్దేశంతో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. అయితే ప్రజలకు ఇబ్బందులు తాత్కాలికమేనని ఆయన భరోసా ఇచ్చాన్నారు. ఇవి నెల రోజులు ఉంటాయని ఆయన తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాలన్న సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన చెప్పారు. 500, 1000 రూపాయల నోట్ల రద్దు మొదటి ప్రయత్నమేని, దీనివల్ల దేశ రాజకీయాల్లో పారదర్శకత వస్తుందని రాజ్‌నాథ్ అన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో మాజీ సైనికుల కోసం ఓఆర్‌ఓపి హామీ ఇచ్చిన నరేంద్ర మోదీ అధికారంలోకి రాగానే పథకాన్ని ప్రకటించారని హోమ్‌మంత్రి పేర్కొన్నారు.