జాతీయ వార్తలు

మరిన్ని ఉద్యోగాల సృష్టి అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 16: దేశంలో ఉద్యోగాల సృష్టి ఏడేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిందని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉద్యోగాల సృష్టి ప్రభుత్వం ప్రాధాన్యతగా ఉండాలన్నారు. బుధవారం ఇక్కడ వివిధ విద్యాసంస్థల అధిపతుల సమావేశంలో రాష్టప్రతి మాట్లాడుతూ, ఇటీవలి కాలంలో విద్యా సంస్థల్లో తలెత్తిన అశాంతిని ప్రస్తావిస్తూ, విద్యార్థులు ఉన్నత చదువులు చదవడానికి అనువైన శాంతియుత వాతావరణాన్ని విద్యాలయాల్లో కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశంలో విద్యాసంస్థలు బ్రెయిన్‌డ్రెయిన్‌నుంచి బ్రెయిన్ రెయిన్‌కు మారడం ద్వారా టాలెంట్‌ను ఆకర్షించే అయస్కాంతాలుగా ఉండాలని అన్నారు. దేశంలో టాలెంట్‌కు కొరత లేదని, ప్రపంచంలోనే యువ జనాభా అత్యధికంగా ఉన్న దేశంగా మనం ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం లేదన్నారు. అయితే పని చేయగల సామర్థ్యం ఉన్నవాళ్ల ఉత్పాదకత సామర్థ్యంపై అది ఆధారపడి ఉందని దేశంలో తగినన్ని ఉద్యోగాలు ఉన్నట్లయితే సంతృప్తి, పరిపూర్ణత ఉంటాయని, అలా కాని పక్షంలో పరిస్థితి దారుణంగా ఉంటుందని రాష్టప్రతి అన్నారు. యువతలో నిరాశా నిస్పృహలు తలెత్తితే అది తిరుగుబాటుకు దారితీస్తుంది. మన సమాజంలో అలాంటి పరిస్థితిని రానివ్వకూడదు. మన జనాభాలో ఉన్న ప్రత్యేక పరిస్థితులను బలంగా మార్చుకోవాలి. అందుకు తగినన్ని ఉద్యోగాలను సృష్టించడం ప్రాధాన్యత కావాలి. 2015లో ఉద్యోగాల గణాంకాలు 1.35 లక్షలు మాత్రమేనని, గత ఏడేళ్లకాలంలో అతి తక్కువని, ఇది మంచి పరిణామం కాదని ప్రణబ్ అన్నారు. మనుషుల స్థానంలో యంత్రాలు వస్తున్నాయని, ఈ మార్పుపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. భారతదేశంలో ఏర్పడుతున్న ఉపాధి అవకాశాలను చూసి విదేశాల్లో పనిచేస్తున్న వృత్తి నిపుణులు చాలామంది స్వదేశానికి తిరిగి రావడానికి ఆసక్తిగా ఉన్నారని, అందువల్ల మనం బ్రెయిన్‌డ్రెయిన్‌నుంచి బ్రెయిన్ రెయిన్‌కు మారాల్సిన అవసరం ఉందన్నారు. మన విద్యాసంస్థలను అంతర్జాతీయ స్థాయి సంస్థలుగా మార్చడానికి తగిన శ్రద్ధ చూపించినట్లయితే బ్రెయిన్ నెట్‌వర్క్‌నే తయారు చేయవచ్చని రాష్టప్రతి భవన్‌లో ఏర్పాటు చేసిన రెండవ విజిటర్స్ సదస్సులో మాట్లాడుతూ రాష్టప్రతి అన్నారు.