జాతీయ వార్తలు

అసెంబ్లీ సీట్లు పెంచలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 23: రాష్ట్రాల్లో శాసన సభా స్థానాలు ఇప్పట్లో పెంచలేమని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. 2026 జనాభా లెక్కలు ప్రకటించనంత వరకు స్థానాల పెంపు అసాధ్యమని పేర్కొంది. ఆర్టికల్ 170ని సవరించకుండా తెలంగాణలోని అసెంబ్లీ స్థానాలను 119 నుంచి 153కి పెంచటం సాధ్యంకాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారాం అహిర్ స్పష్టం చేశారు. తెలుగుదేశం ఎంపీ టిజి వెంకటేశ్ అడిగిన ప్రశ్నకు గంగారాం అహిర్ లిఖిత పూర్వక సమాధానంలో ఈ విషయాన్ని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు తమ శాసన సభ స్థానాలను 119 నుంచి 153కు పెంచాలని తెలంగాణ ప్రభుత్వం ఏదైనా ప్రతిపాదన చేసిందా? ప్రతిపాదన చేసివుంటే దాని వివరాలు ఏమిటి? దీనికి ప్రభుత్వ స్పందన ఏమిటి? అన్నది వెంకటేశ్ ప్రశ్నలు. దీనికి గంగారాం అహిర్ ఇచ్చిన సమాధానంలో ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీమేరకు శాసన సభ స్థానాలు 119 నుంచి 153కు పెంచాలని తెలంగాణ విజ్ఞప్తి చేసిన మాట వాస్తవమే. ఈ విజ్ఞప్తిని కేంద్ర న్యాయ శాఖకు పంపించాము. వారు అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని అడిగారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 (3) ప్రకారం 2026లో మొదటి జనాభా లెక్కల వివరాలు ప్రకటించనంత వరకు దేశంలోని ఏ రాష్ట్రాల శాసన సభల మొత్తం సీట్లను సవరించేందుకు వీలులేదని అట్టార్నీ జనరల్ స్పష్టం చేశారు. అందుకే రాజ్యాంగంలోని 170 ఆర్టికల్‌ను ఏపీ విభజన చట్టంలోని 26 సెక్షన్‌కు అనుగుణంగా ఉండేలా సవరించనంత వరకు శాసన సభ స్థానాలు సవరించేందుకు వీలులేదని పేర్కొన్నారు.