జాతీయ వార్తలు

మీకు పాలించే అర్హతే లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 23: ప్రధాని నరేంద్ర మోదీకి దేశాన్ని పాలించే అర్హతే లేదని విపక్షాలు నిప్పులు చెరిగాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలో బుధవారం జంతర్‌మంతర్‌లో జరిగిన భారీ ర్యాలీలో నాలుగు పార్టీల నేతలు కేంద్ర ధోరణిని ఎండగట్టారు. పెద్ద నోట్ల రద్దు వల్ల దేశ వ్యాప్తంగా కోటానుకోట్ల మంది ప్రజలు పడుతున్న ఇబ్బందులు, అవస్థలు ప్రధాని మోదీకి పట్టడం లేదని.. ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మమత ధ్వజమెత్తారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం వైదొలగాల్సిందేనని..మోదీ చేతుల్లో దేశానికి రక్షణే లేదని అన్నారు. సమాజ్‌వాది పార్టీ, జెడియూ, ఎన్‌సిపి,ఆప్ పార్టీలకు చెందిన నేతలతో కలిసి ర్యాలీనుద్దేశించి మాట్లాడిన మమత పెద్ద నోట్ల రద్దుపై తమది ఉమ్మడి గళమేనని తేల్చిచెప్పారు. దేశంలో ప్రజలందరి మనుగడకు కీలకమైన కరెన్సీ వినియోగంలో ఆంక్షలు పెడుతున్న మోదీ ప్రభుత్వం దేశాన్ని పాలించే అర్హత, విశ్వసనీయతను కోల్పోయిందన్నారు. పెద్ద నోట్ల రద్దు ప్రజలకు భరించలేని బాధను కలిగిస్తోందని, వారి ప్రజాస్వామ్య హక్కుల్ని హరిస్తోందని అన్నారు. రైతులు,యువత, మహిళలు, కార్మికులు, వర్తకులు ఇలా సమాజంలోని అన్ని వర్గాల మనుగడపైనా మోదీ సర్కార్ నిర్ణయం తీవ్ర ప్రభావానే్న కనబరుస్తోందని మమత అన్నారు. ఈ అనాలోచిత నిర్ణయం కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడిపోయే పరిస్థితి తలెత్తిందని హెచ్చరించారు. సామాన్యుడ్ని దోచుకుంటున్న మోదీ సర్కార్ స్విస్ అక్రమ ఖాతాదారుల జోలికి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్రంలోని అధికార పార్టీకి ప్రజలు గట్టి గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ నల్ల చట్టాన్ని ఎవరూ సహించే పరిస్థితి లేదన్నారు. ‘వచ్చే ఎన్నికల్లో ఎవరూ బిజెపికి ఓటేయరు..నేనే మీ స్థానంలో (పిఎం) ఉంటే ఈ పరిస్థితికి ఇప్పటికే ప్రజలకు క్షమాపణ చెప్పేదానే్న..’నని మమత అన్నారు. మోదీ అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించిన దీదీ నల్లధన నిర్మూలన పేరుతో ఆయన ప్రతి పౌరుడ్ని వేధిస్తున్నారని అన్నారు. ‘మీరే సాధువైనట్టుగా..మిగతా వాళ్లందరూ అక్రమార్కులుగా ముద్ర వేస్తున్నారు’అంటూ మోదీపై విరుచుకు పడ్డారు. హిట్లర్‌ను మించిన స్థాయిలోనే మోదీ సర్కార్ అహంకారపూరితంగా వ్యవహరిస్తోందా అంటూ విస్మయం వ్యక్తం చేశారు. నోట్ల రద్దు వంటి కీలక నిర్ణయం తీసుకునే ముందు మిగతా పార్టీలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం న్యాయబద్ధత ఏమిటని జెడియూ నాయకుడు శరద్ యాదవ్ కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ నిర్ణయం వల్ల దేశానికి ఏ రకమైన ప్రయోజనం కలుగుతుందో పార్లమెంట్‌కు వచ్చి వివరించాలని ప్రధాని మోదీకి సవాలు విసిరారు. ‘ఏ చట్టం కింద పెద్ద నోట్ల చలామణిని రద్దు చేశారు..తాము కష్టపడి సంపాదించుకుని దాచుకున్న సొమ్మును తీసుకోకుండా వారిని ఎందుకు అడ్డుకుంటున్నారు’అని మోదీని నిలదీశారు. తాము సంపాదించుకున్నది అనుభవించేందుకు ప్రజలకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కునే కేంద్ర ప్రభుత్వం హరించిందన్నారు. సమాజ్‌వాది పార్టీ నాయకుడు ధర్మేంద్ర యాదవ్, ఎన్‌సిపి నేత మజిద్ మీనన్ సహా వివిధ పార్టీలకు చెందిన నేతలు ఈ ర్యాలీలో మాట్లాడారు.

చిత్రం... జంతర్ మంతర్ వద్ద బుధవారం నిర్వహించిన భారీ ర్యాలీ వేదికపైకి
వస్తున్న తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, ఎంపీ జయాబచ్చన్