జాతీయ వార్తలు

బాలమురళికి పార్లమెంటు నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 23: ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ మృతికి పార్లంమెంట్ ఉభయ సభలు సంతాపం తెలిపాయి. బుధవారం లోక్‌సభ ప్రారంభమైన వెంటనే బాల మురళి సంగీత ప్రపంచానికి చేసిన సెవలను సభ కొనియాడింది. ఆయన మృతికి సంతాప సూచకంగా సభ 2 నిముషాలు వౌనం పాటించింది. అలాగే రాజ్యసభ కూడా ఆయన భారతీయ శాస్ర్తియ సంగీత గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తిఅని చైర్మన్ అన్సారీ కొనియాడారు. బాలమరళీకృష్ణతో పాటు ఇటీవల మృతి చెందిన యూపీ మాజీ ముఖ్యమంత్రి రామ్‌నరేష్ యాదవ్, శాస్తవ్రేత్త ఎంజికె మినన్ కూడా సంతాప సూచకంగా సభ రెండు నిముషాలు వౌనం పాటించింది.
జార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్
ఆరుగురు నక్సల్స్ హతం
రాంచి, నవంబర్ 23: జార్ఖండ్‌లోని మావోల ప్రభావిత ప్రాంతంలో బుధవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు నక్సలైట్లు హతమయ్యారు. లతెహార్ జిల్లాలోని కోయల్ నది ఉత్తర తీర ప్రాంతంలో ఉన్న కరంధి-చిప్పదోహార్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సిఆర్‌పిఎఫ్‌కు చెందిన కోబ్రా దళాలు కూంబింగ్ జరుపుతుండగా నక్సలైట్లు కాల్పులు జరిపారు. కోబ్రా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు నక్సలైట్లు మృతిచెందారని, వారినుంచి భారీ ఆయుధ సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు సిఆర్‌పిఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఆపరేషన్స్) సంజయ్ ఎ. లత్కర్ వెల్లడించారు. మృతులంతా నక్సలైట్ల యూనిఫాంలో ఉన్నారని, వారినుంచి 600 బుల్లెట్లు, పేలుడు పదార్థాలు, ఒక ఎస్‌ఎల్‌ఆర్ తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నామన్నారు. అటవీ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతోందని ఆయన తెలిపారు. రెండు రోజులుగా కూంబింగ్ జరుగుతోందని, బుధవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో కోబ్రా దళాలపై నక్సలైట్లు కాల్పులు జరపడంతో ఎదురుకాల్పులు జరిపినట్లు ఆయన వెల్లడించారు.