జాతీయ వార్తలు

హైకమిషన్ సిబ్బంది పరస్పర ఉపసంహరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 23: పాకిస్తాన్ హైకమిషన్ ఉద్యోగి మెహబూబా అక్తర్ గూఢచర్యం బయటపడడంతో ఎనిమిది మంది ఎంబసీ అధికారులను ఆ దేశం ఉపసంహరించుకుందని కేంద్రం స్పష్టం చేసింది. అలాగే భారత్ కూడా ఎనిమిది మంది అధికారులను వెనక్కురప్పించినట్టు బుధవారం పార్లమెంటుకు తెలిపింది. కేంద్ర విదేశాంగ మం త్రి సుష్మా స్వరాజ్ సభకు ఓ లిఖితపూర్వక సమాధానం ఇస్తూ నవంబర్ 2న ఆరుగురు హైకమిషన్ అధికారులను పాకిస్తాన్ వెనక్కిరప్పించిందని వెల్లడించారు. అక్తర్ ఇంటరాగేషన్‌లో ఆ అధికారుల పాత్రను వెల్లడించాడని మంత్రి తెలిపారు. ఢిల్లీ పోలీసులు అక్తర్ గూఢచర్యంపై దర్యాప్తు జరిపినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే ఈనెల 16న మరో ఇద్దరు అధికారులను పాకిస్తాన్ ఉపసంహరించుకుందని మంత్రి వివరించారు. ఏడుగురు కుటుంబ సభ్యులను వెనక్కిరపించిందని ఆమె అన్నారు. భారత హైకమిషన్‌లోని ఎనిమిది మంది అధికారులపై పాకిస్తాన్ విదేశాంగశాఖ అభియోగాలు చేసిందని సుష్మా స్వరాజ్ చెప్పారు. అధికారులు, వారి హోదాలు పాక్ మీడియాలో కథనాలు వచ్చాయన్నారు. పదేపదే పాకిస్తాన్ అవాస్తవ, అభూతకల్పనలు ప్రచారం చేసినట్టు ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హైకమిషన్‌లోని అధికారుల భద్రత దృష్ట్యా మూడు దశల్లో ఎనిమిది మంది అధికారులను భారత్‌కు రప్పించినట్టు సుష్మా వెల్లడించార. ఈనెల 8, 10, 12 తేదీల్లో కుటుంబ సభ్యులతో సహా ఎనిమిది మంది ఎంబసీ ఉద్యోగులు స్వదేశానికి వచ్చారని ఆమె అన్నారు.వియన్నా ఒప్పంద నిబంధనలకు విరుద్ధంగా పాకిస్తాన్ వ్యవహరిస్తోందని భారత్ విమర్శించింది. భారత అధికారుల ఫొటోలు, హోదాలు పాక్ మీడియాలో ప్రచురించడాన్ని విదేశాంగ మంత్రి తీవ్రంగా తప్పుపట్టారు.
ముఠాలు కట్టొద్దు
చాడీకోరులు కావొద్దు
ఎస్‌పి శ్రేణులకు ములాయం హితవు
ఘాజిపూర్ (ఉత్తరప్రదేశ్), నవంబర్ 23: పార్టీ లో ముఠాలు కట్టడాన్ని, చాడీలు చెప్పడాన్ని మానివేయాలని సమాజ్ వాదీ పార్టీ అధినేత ములా యం సింగ్ యాదవ్ బుధవారం తమ పార్టీ కార్యకర్తలను ఆదేశించారు. పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీపై ఉందని, అందువల్ల మీరు క్రమశిక్షణతో పనిచేయాలని ఆయన యువ నాయకులకు పిలుపునిచ్చారు. ‘ముఠాలు కట్టడాన్ని మానివేయండి.. ఏ నాయకుడికయినా వ్యక్తిగతంగా మద్దతుదారులుగా ఉండే బదులు మొత్తంగా సమాజ్‌వాదీ పార్టీకి మద్దతుదారులుగా ఉండండి.. తప్పుడు పద్ధతుల్లో నడుస్తున్న వారిని పార్టీ (నిజమైన) శ్రేయోభిలాషులు కనిపెట్టారు’ అని ములాయం హెచ్చరించారు. ‘నేను పార్టీలో ఐక్యతను కోరుకుంటున్నాను. స్పష్టమైన ఆధిక్యతతో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి.. ఇది నా లక్ష్యం’ అని ఆయన ఇక్కడ పార్టీ కార్యకర్తల సమావేశంలో పేర్కొన్నారు. సమాజ్‌వాదీ పార్టీలో విలీనమైన ఖ్వామి ఏక్తా దళ్ నేతలయిన అన్సారీ సోదరులకు పట్టు గల ఈ ప్రాంతంలో మాట్లాడుతూ ములాయం ఈ వ్యాఖ్యలు చేశారు. ఖ్వామి ఏక్తా దళ్ విలీనంతో పూర్వాంచల్‌లో ఎస్‌పి మరింత బలోపేతం అవుతుందని అన్నారు.