జాతీయ వార్తలు

అన్ని కోర్టుల్లోనూ విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 23: పెద్ద నోట్ల రద్దుపై వివిధ హైకోర్టుల్లో దాఖలవుతున్న పిటిషన్ల విచారణపై స్టే ఇవ్వలేమని అత్యున్నత న్యాయస్థానం కేంద్రానికి స్పష్టం చేసింది. నోట్ల రద్దుకు సంబంధించి వివిధ కోర్టులో దాఖలవుతున్న పిటిషన్లన్నింటినీ సుప్రీం కోర్టులోనో, ఏదైనా ఒక హైకోర్టులోనో ఒకేచోట విచారణ జరపాలని కేంద్రం సుప్రీం కోర్టును కోరిన సంగతి తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి. ఎస్ ఠాకూర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కేంద్రం విజ్ఞప్తిని తిరస్కరించింది. ‘మేం స్టే ఇవ్వలేం. ఈ వ్యవహారంలో చాలా అంశాలు ఇమిడి ఉన్నాయి. ప్రజలకు హైకోర్టుల నుంచి త్వరగా ఉపశమనం కలిగే అవకాశం ఉంది.’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. కేంద్రం విజ్ఞప్తిపై స్పందించాలని అందరు పిటిషనర్లను కోరింది. ‘‘ఈ విషయంలో మీరు (ప్రభుత్వం) అవసరమైన అన్ని చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది. ఇప్పుడు దేశంలో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పటి వరకు ఏ మేరకు నగదును వసూలు చేయగలిగారు?’’ అని ధర్మాసనం ప్రశ్నించింది. ఇందుకు అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ సమాధానం ఇస్తూ పెద్ద నోట్ల రద్దు తరువాత తొలి రోజుల కంటే ఇప్పుడు పరిస్థితి బాగా మెరుగుపడిందని, సుమారు ఆరు లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో దేశవ్యాప్తంగా డిపాజిట్ అయ్యాయని న్యాయస్థానానికి వివరించారు. ఏడు దశాబ్దాలుగా పేరుకుపోయిన నల్లధనాన్ని వెలికితీయటమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన వివరించారు. ఏరోజుకారోజు.. ఏ గంటకాగంట దేశంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని ఆయన ధర్మాసనానికి వివరించారు. వాస్తవ పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రభుత్వం ఒక కమిటీని కూడా నియమించిందని రోహత్గీ తెలిపారు. సాధారణంగా మార్కెట్‌లో నగదు లావాదేవీలు స్థూల జాతీయోత్పత్తి రేటులో(జిడిపి) నాలుగు శాతం మించరాదని, మన దేశంలో ఇది 12శాతం ఉందని ఆయన న్యాయమూర్తులకు వివరించారు. దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో దాఖలవుతున్న నోట్ల రద్దు పిటిషన్లను సుప్రీంకోర్టుకు కానీ, లేదా ఏదైనా ఒక హైకోర్టుకు కానీ బదలాయించాలని ఆయన కోరారు. కేంద్రం పిటిషన్‌పై స్పందించాల్సిందిగా దేశంలోని వివిధ కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేస్తున్న వారిని ధర్మాసనం కోరింది. ఈ కేసు విచారణను డిసెంబర్ 2కు వాయిదా వేసింది.