జాతీయ వార్తలు

నోట్ల మార్పిడి బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్ధరాత్రి నుంచే అమలు
పాత వెయ్యినోటుతో బిల్లుల చెల్లింపు నిలిపివేత
పాత 500నోటుతో చెల్లింపులకు 15వరకు గడువు
2 దాకా టోల్ రుసుం మినహాయింపు
3నుంచి 15దాకా రూ.500తో టోల్ పన్ను స్వీకరణ
విదేశీయులకు వారానికి రూ.5వేల వరకు నగదు మార్పిడి
కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయాలు

న్యూఢిల్లీ, నవంబర్ 24: పాత వెయ్యినోటుకు కేంద్రం దాదాపుగా మంగళం పాడింది. గురువారం అర్ధరాత్రి నుంచి పాత వెయ్యి రూపాయల నోటుతో ఎలాంటి చెల్లింపులు జరపడానికి వీలు లేదని కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. అంతేకాకుండా గురువారం అర్ధరాత్రి నుంచి పాత పెద్ద నోట్ల మార్పిడిని పూర్తిగా నిలిపివేస్తున్నట్లు విస్పష్టంగా ప్రకటించింది. బ్యాంకు కౌంటర్లలో, పోస్ట్ఫాసుల్లో ఎలాంటి నగదు మార్పిడి జరగదని, కేవలం పాత పెద్ద నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయటం కోసమే స్వీకరిస్తారని తెలిపింది. దేశ వ్యాప్తంగా నోట్ల మార్పిడి కోసం క్యూలు క్రమంగా తగ్గిందని, దీంతో పాటు ఇప్పటి వరకు బ్యాంకింగ్ వ్యవస్థ తెలియని వారిని కొత్త బ్యాంకు ఖాతాలను తెరిచేలా ప్రోత్సహించటం కోసం నగదు మార్పిడిని రద్దు చేస్తున్నట్లు ఆర్థిక శాఖ తన ప్రకటనలో వివరించింది. నగదు మార్పిడి రద్దుతో పాటు పాతనోట్లకు సంబంధించి పలు మినహాయింపుల విషయంలోనూ మార్పులు చేర్పులు చేసింది. కొన్ని మినహాయింపులను తొలగించగా, మరికొన్నింటిని డిసెంబర్ 15వరకు పొడిగించింది. అయితే ఈ మినహాయింపుల జాబితాలో ఉన్న చెల్లింపులన్నీ రూ.500నోట్లలోనే జరగాలని తేల్చిచెప్పింది. నవంబర్ 8న పెద్దనోట్లు రద్దు నిర్ణయం ప్రకటించినప్పటి నుంచి ముందుగా 48గంటల పాటు మినహాయింపునిచ్చిన ప్రభుత్వం ఆ తరువాత నవంబర్ 24వరకు పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీటిలో కొన్నింటిని కలిపి..మరి కొన్నింటిని రద్దు చేసి కేవలం రూ.500 నోటుతోనే చెల్లింపులకు అనుమతిచ్చింది.
* మినహాయించిన కేటగిరీలలోని అన్ని చెల్లింపులూ పాత రూ.500 నోట్లతోనే జరుగుతాయి.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు, మున్సిపల్, స్థానిక సంస్థల పాఠశాలలో రూ. 2000వరకు చెల్లించవచ్చు.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల్లో ఫీజుల చెల్లింపులకు అవకాశం.
* ప్రీ పెయిడ్ మొబైల్ టాప్ అప్‌ను ఒకేసారి రూ.500 చేయించుకుంటే అందుకు పాత నోటును చెల్లించవచ్చు.
* సహకార సూపర్ బజార్‌లలో ఒకేసారి రూ.5000 వరకు చేసే కొనుగోళ్లను పాత 500నోటుతో చెల్లింపులు చేయవచ్చు
* ప్రస్తుత, బకాయి పడ్డ విద్యుత్తు, నీటి బిల్లులను చెల్లించవచ్చు. ఈ అవకాశం వ్యక్తులు, సాధారణ గృహ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది.
* రోడ్డు రవాణా శాఖ విజ్ఞప్తి మేరకు డిసెంబర్ రెండు వరకు జాతీయ రహదారులపై టోల్ టాక్స్ వసూళ్లను మినహాయించారు. ఆ తరువాత డిసెంబర్ 15వరకు రూ.500తో టోల్ రుసుము చెల్లించవచ్చు.
* విదేశీ పౌరులు వారానికి రూ.5000 వరకు నగదు మార్పిడి చేసుకోవచ్చు. వారి పాస్‌పోర్ట్‌లలో దీనికి సంబంధించి ఎంట్రీ వేస్తారు.

చిత్రం...నోట్లు మార్చుకునేందుకు గురువారం అలహాబాద్‌లోని ఓ బ్యాంకు ముందు బారులు తీరిన జనం