జాతీయ వార్తలు

వెనక్కి తగ్గే ప్రశే్నలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 23: ఓసారి నిర్ణయం తీసుకున్నాక వెనక్కి తగ్గటం అన్నది ప్రధాని నరేంద్రమోదీ రక్తంలోనే లేదని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడు బుధవారం ఉద్ఘాటించారు. కొన్ని విపక్ష రాజకీయ పార్టీలు డిమాండ్ చేసినంత మాత్రాన పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని రద్దు చేసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వెయ్యి, 500 రూపాయల నోట్ల రద్దు నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గనే తగ్గదంటూ విస్పష్టంగా తెలియజేశారు. ఈ నిర్ణయం వల్ల దేశ ప్రజలందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా పరిస్థితులు మెరుగు పరచేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకు సంబంధించి విపక్షాలు ఇచ్చే గుణాత్మక సలహాలను స్వీకరించటానికీ తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఢిల్లీ కిసాన్ మజ్దూర్ సంఘం మహా పంచాయతిని ఉద్దేశించి బుధవారం ఇక్కడ మాట్లాడిన వెంకయ్యనాయుడు పెద్ద నోట్ల రద్దుపై ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్లను తిప్పికొట్టారు. ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చించటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా, ఏరోజుకారోజు అలజడి సృష్టిస్తూ ప్రతిపక్షాలే తప్పించుకుంటున్నాయని ఎదురుదాడి చేశారు. నోట్లను మార్చుకోవటం కోసం క్యూలు కట్టి మరణించిన వారిని ఉరీ ఉగ్రవాదుల దాడుల్లో మరణించిన వారితో పోల్చటాన్ని సిగ్గుచేటైన చర్యగా వెంకయ్య అభివర్ణించారు. విపక్షాలు ఈ రకంగా వ్యా ఖ్యలు చేయటం దురదృష్టకరమని, దీన్ని రాజకీయంగా మార్చి ప్రయోజనం పొందాలని చూస్తున్నాయని ఆయన అన్నారు. ప్రధాని మోదీకి దేశంలోని పేద ప్రజల మద్దతు ఉందని, ఆయన తీసుకున్న చారిత్రక నిర్ణయం వల్ల సమాజంలోని అణగారిన వర్గాలు, రైతులు లబ్ధి పొందుతారని తెలిపారు. అయితే, మోదీ నిర్ణయం కారణంగా కొందరు వ్యక్తు లు మాత్రం ఇటు ఏడవలేక, అటు ని ద్రపట్టక నానా తంటాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. అయితే, కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నోట్ల రద్దుగా పరిగణించకూడదని, నోట్ల మార్పిడిగానే అన్వయించుకోవాలని కొత్త నిర్వచనం ఇచ్చారు. ఈ నిర్ణయం వల్ల ప్రజలకు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదురవుతుందన్న విషయం ప్రభుత్వానికి తెలుసని, కానీ, దీని గురించి ఏ మాత్రం పొక్కినా, అంతిమ లక్ష్యం విఫలమవుతుందనే రహస్యంగా ఉంచాల్సివచ్చిందని దేశ వ్యాప్తంగా చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీని మార్చటం అన్నది అంత తేలిక కాదని, కొత్త నోట్ల ప్రింటింగ్ కూడా ఎంతో సమయాన్ని తీసుకునేదేనని తెలిపారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం విషయంలో మీడియా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని కోరారు.