జాతీయ వార్తలు

పెద్దనోట్ల రద్దు ఓ కుంభకోణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 23: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పెద్దనోట్లను రద్దు చేయటం వలన సామాన్య జనం పడుతున్న కష్టాలను ఎన్‌డిఏ ప్రభుత్వం పరిష్కరించటం లేదంటూ ప్రతిపక్ష పార్టీలు బుధవారం పార్లమెంటు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద మహా ధర్నా చేశాయి. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో జరిగిన మహా ధర్నాకు కాంగ్రెస్‌తోపాటు తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు, డిఎంకె, శివసేన, జెడియు, ఆర్‌జెడి, సమాజ్‌వాదీ, బిఎస్‌పి, ఎంఐఎం తదితర పార్టీల ఎంపీలు, నాయకులు హాజరయ్యారు. రాహుల్ గాంధీ, ఆనంద్‌శర్మ, మల్లిఖార్జున ఖర్గే, గులాం నబీ ఆజాద్, డెరిక్ ఓబ్రేన్, శరద్ యాదవ్, కనిమోళి, సీతారాం ఏచూరి, ప్రపుల్‌పటేల్, తిరుచ్చి శివ, రాంభూపాల్ యాదవ్, సతీష్ మిశ్రా, తారిక్ అన్వర్ తదితర రెండు వందల మంది ఎంపీలు అర్థగంట పాటు గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారు. మోదీ ఒక్క వేటుతో దేశంలో ఆర్థిక గందరగోళం సృష్టించారని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. పెద్దనోట్ల రద్దు పెద్ద కుంభకోణం, దీనిపై జెపిసి విచారణ జరగవలసిందేనని ఆయన డిమాండ్ చేశారు. పెద్ద నోట్లను రద్దు చేయాలనే నిర్ణయం ఎందుకు తీసుకోవలసి వచ్చిందనేది దేశ ప్రజలకు వివరించవలసిన బాధ్యత నరేంద్ర మోదీపై ఉన్నదని పలువురు ప్రతిపక్షం నాయకులు చెప్పారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని కొందరికి ముందే ఎందుకు లీక్ చేశారనేది కూడా మోదీ వివరించవలసి ఉందని రాహుల్ అన్నారు. మోదీ ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీతో పాటు ఇతర ఆర్థిక నిపుణులతో ఎందుకు సంప్రదింలేదని ఆయన నిలదీశారు. పెద్దనోట్ల రద్దు గురించి బహిరంగ సభలు, పాప్ సంగీత విభావరుల్లో వివరిస్తున్న నరేంద్ర మోదీ పార్లమెంటు ఉభయ సభల్లో దీని గురించి ఎందుకు మాట్లాడటం లేదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ప్రశ్నించారు. ప్రజలెదుర్కొంటున్న ఇబ్బందులపై విపక్షాలు ప్రశ్నిస్తున్నా ప్రధాని వౌనం దాల్చడంపై ఆయన నిరసించారు. ప్రతిపక్షానికి చెందిన ప్రతి పార్టీ నల్లధనం, అవినీతిని వ్యతిరిస్తోందనేది మరిచిపోరాదని రాహు ల్ గాంధీ చెప్పారు. సమాజంలోని ప్రతివర్గం వారిని దెబ్బ తీసిన మోదీ నిర్ణయాన్ని మార్చుకోకతప్పదని ఆయన సూచించారు. ఎన్‌డిఏ ప్రభు త్వం సగటు మనిషి కష్టాలు పట్టించుకోవటం లేదని ప్రతిపక్షం నాయకులు విరుచుకుపడ్డారు.

పెద్దనోట్లను రద్దు చేయటం వలన సామాన్య జనం పడుతున్న కష్టాలను ఎన్‌డిఏ ప్రభుత్వం పరిష్కరించటం లేదంటూ
ప్రతిపక్ష పార్టీలు బుధవారం పార్లమెంటు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద మహా ధర్నా చేస్తున్న దృశ్యం