జాతీయ వార్తలు

శభాష్... మోదీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 23: దేశవ్యాప్తంగా పెద్దనోట్ల చలామణీని రద్దుచేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయంపై భారీగా సానుకూల స్పందన వ్యక్తమైంది. ఈ నిర్ణయం వల్ల కొంత ఇబ్బంది కలుగుతున్నప్పటికీ దానివల్ల ఒనగూడే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటే దీన్ని భరించాల్సిందేనన్న అభిప్రాయాన్ని ఈ సర్వేలో పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు. ఓపక్క మోదీ నిర్ణయం వల్ల పేదలు తీవ్ర స్థాయిలో యాతనలు పడుతున్నారని, సమయానికి డబ్బులు అందక మరణాలూ సంభవిస్తున్నాయంటూ విపక్షాలు ముక్తకంఠంతో ధ్వజమెత్తుతున్న నేపథ్యంలో ‘మీరే చెప్పండి’ అంటూ మోదీ ఇచ్చిన పిలుపునకు ప్రజలు భారీగానే స్పందించారు. కేవలం 24 గంటల్లోనే దాదాపు ఐదులక్షలమంది మోదీ యాప్ ద్వారా తమ ప్రతిస్పందనను తెలిపారు. నోట్ల రద్దు నిర్ణయం సానుకూలమేనని, నల్లధనాన్ని అరికట్టడానికి ఇదే సరైన మార్గమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇంత భారీగా సానుకూలంగా స్పందించిన వారికి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటివరకు కూడా విధాన లేదా రాజకీయపరమైన అంశాలపై ఈ రకమైన సర్వే నేరుగా నిర్వహించిన దాఖలాలు లేవు. అవినీతి నిరోధానికి సంబంధించి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు చాలా మంచివేనన్న అభిప్రాయాన్ని 92 శాతంమంది వ్యక్తం చేశారు. ఇక నోట్ల రద్దుకు సంబంధించి కేవలం 2 శాతంమంది మాత్రమే దీన్ని వ్యతిరేకించారు. మొత్తం ఐదులక్షలమంది సర్వేలో పాల్గొన్నారు.
ఇదిలావుండగా, సి-ఓటర్ నిర్వహించిన ఈ సర్వేలో 80 నుంచి 86 శాతంమంది మోదీ నిర్ణయాన్ని బలపరిచారు. నల్లధనాన్ని అరికట్టాలంటే ఈ రకమైన కఠిన చర్యలు తప్పవన్న నిశ్చితాభిప్రాయం వ్యక్తం చేశారు. దేశంలోని పార్లమెంటు నియోజకవర్గాలు సగం వాటిలో ఈ సర్వే జరిగింది. ప్రాంతాలు, ఆదాయస్థాయి, వయసు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ సర్వే నిర్వహించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారిలో 86 శాతంమంది తాము పడుతున్న అవస్థలు రానున్న ప్రయోజనాల కోసమేనన్న భావనను వ్యక్తం చేశారు. ఇక సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఈ సానుకూల స్పందన 80.6 శాతం ఉంది. ఉన్నతాదాయ వర్గాల్లో 90.6 శాతంమంది మోదీ నిర్ణయాన్ని సమర్థించారు. పట్టణ ప్రాంతాల్లో జరిగిన సర్వేలో పాల్గొన్న వారిలో 71 శాతంమంది, సెమీ అర్బన్ ప్రాంతాల్లో 65.1 శాతం మంది, గ్రామీణ ప్రాంతాల్లో 59.4 శాతంమంది పెద్దనోట్ల రద్దు సమర్థనీయమేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే మరో 12.6 శాతంమంది ఈ నిర్ణయాన్ని ఓ ఆర్థిక విపత్తుగా, ఎంతమాత్రం అధిగమించలేనిదిగా పేర్కొన్నారు.