జాతీయ వార్తలు

అవినీతి హక్కవుతోంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 25: ‘అవినీతి, నల్లధనానికి కొందరు బాహాటంగా మద్దతిస్తున్నారు. దీనివల్ల భావితరాలకు తీరని అన్యాయం జరుగుతుంది’ అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్షంపై పరోక్ష ఆరోపణలు చేశారు. నరేంద్ర మోదీ శుక్రవారం పార్లమెంట్ ఆవరణలోని బాలయోగి గ్రంథాలయంలో బిజెపి సీనియర్ నాయకుడు కేదార్‌నాథ్ సహానిపై రచించిన రెండు పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో విలువలు పడిపోవటం వలన దేశానికి ఎంతోనష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. దేశం కోసం జీవించేవారి ప్రజా జీవితంలో మచ్చలేకుండా ఉండాలని సూచించారు. దేశంలో ఇప్పుడొక వర్గం, గ్రూపు బాహాటంగా నల్లధనం, అవినీతిని సమర్థిస్తోంది. అంతేకాదు, వీటికి మద్దతుగా జెండా పట్టుకుని నిలబడుతున్నారు’ అని విపక్షాలను పరోక్షంగా ఎత్తిపొడిచారు. ప్రస్తుత సమాజంలో విలువలు పడిపోతున్నాయని, వాటిని తుంగలో తొక్కుతున్నారని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పుడు ప్రజలు అవినీతికి విరుద్ధంగా పోరాడేందుకు వ్యక్తిగత నష్టాన్ని సైతం భరించే వారు. లంచం ఇచ్చేందుకు ప్రజలు నిరాకరించేవారన్నారు. అయితే పరిస్థితి మారిపోయింది. సమాజాన్ని మార్చలేం కాబట్టి అవినీతికి పాల్పడుతున్నారు. క్రమంగా సమాజంలో అవినీతి భాగమైపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు పరిస్థితి ఎంతగా దిగజారిందంటే కొందరు అవినీతి, నల్లధనానికి బాహాటంగా మద్దతిస్తున్నారని నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. నల్లధనం, అవినీతి తరఫున బాహాటంగా బజారులోకి దిగుతున్నారు, మద్దతిస్తున్నారని ఆరోపించారు. గతంలో విద్యార్థులు ఫాఠశాలల్లో భయపడుతూ కాపీ కొట్టేవారు. కానీ ఇప్పుడు కాపీ కొట్టటం హక్కుగా మాట్లాడుతున్నారు. బల్లపై కత్తిపెట్టి కాపీ కొడుతూ, ఎవరు ఆపుతారో చూస్తామంటూ బెదిరిస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిణామమని నరేంద్ర మోదీ హెచ్చరించారు. గతంలో విద్యార్థులు చిన్న చిన్న పొరబాట్లు చేసినా, కాపీ కొట్టినా భయపడుతుండేవారు. కానీ ఇప్పుడు బాహాటంగా ఇలాంటి వాటికి తెగబడే ధోరణి వచ్చేసిందని ప్రధాని బాధ వ్యక్తం చేశారు. కాపీ కొట్టడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారంటే విలువలు ఏస్థాయికి పడిపోయాయో అర్థం చేసుకోవచ్చని ప్రధాని ఆవేదనతో అన్నారు. భవిష్యత్ తరాలకోసం నల్లధనం, అవినీతితో పోరాడాల్సిన అవసరం ఎంతో ఉందని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కేదార్‌నాథ్ సహానీ ఆదర్శాలతో అవినీతి, నల్లధనంపై పోరాడుతున్నామన్నారు. నల్లధనం, అవినీతికి మద్దతిచ్చే వారిని, విలువలను తుంగలో తొక్కేవారిని భావతరాలు ఎలాంటి పరిస్థితిలోనూ క్షమించవని ప్రధాని హెచ్చరించారు. చెడు జెండాను భుజానేసుకుని ముందుకు సాగేవారి వల్ల సమాజానికి ఎంతో నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. తాము విలువల ఆధారంగా పెరిగాం, సంస్థవెంట ముందుకు సాగేవాళ్లమని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పుకున్నారు. కేదార్‌నాథ్ సహానీ ఆదర్శాలకు అనుగుణంగా పని చేస్తున్నాం కాబట్టే అవినీతి, నల్లధనాన్ని ఎదుర్కొంటున్నామని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు.